బొట్టు పెట్టి.. హారతిచ్చి..

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ దక్షిణ ఢిల్లీలోని సర్వోదయ విద్యాలయ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ప్రణాళికలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ క్లాసెస్‌లను అక్కడ పరిశీలించనున్నారు. రాజ్‌ఘాట్ వద్ద బాపూజీకి నివాళి అర్పించిన తర్వాత ట్రంప్ దంపతులు హైదరాబాద్ హౌజ్‌కు చేరిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మెలానియా ట్రంప్ సర్వోదయ విద్యాలయకు విచ్చేశారు. స్కూల్ బ్యాండ్‌, పూల పలకరింపు, సంప్రదాయ సరళి స్వాగతాన్ని మెలానియా ట్రంప్ స్వీకరించారు. సంప్రదాయ […]

Update: 2020-02-25 01:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ దక్షిణ ఢిల్లీలోని సర్వోదయ విద్యాలయ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ప్రణాళికలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ క్లాసెస్‌లను అక్కడ పరిశీలించనున్నారు. రాజ్‌ఘాట్ వద్ద బాపూజీకి నివాళి అర్పించిన తర్వాత ట్రంప్ దంపతులు హైదరాబాద్ హౌజ్‌కు చేరిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మెలానియా ట్రంప్ సర్వోదయ విద్యాలయకు విచ్చేశారు. స్కూల్ బ్యాండ్‌, పూల పలకరింపు, సంప్రదాయ సరళి స్వాగతాన్ని మెలానియా ట్రంప్ స్వీకరించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ముగ్గురు విద్యార్థినులు మెలానియా ట్రంప్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. బొట్టుపెట్టి.. హారతిచ్చి తమ పాఠశాలకు ఆహ్వానించారు. పూలు వెదజల్లుతుండగా.. ఆమె పాఠశాలలోనికి వెళ్లారు. ఈ హ్యాపీనెస్ క్లాస్‌లో యోగ, రాజస్తానీ, ఇతర సంప్రదాయ నృత్యకళల్లాంటి ప్రదర్శన ఉండబోతున్నట్టు సమాచారం.

Tags:    

Similar News