అభిమానికి ఆపద్బాంధవుడిగా చిరు

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆరాధ్యుడు. మరెంతో మందికి స్ఫూర్తి ప్రదాత. తన అభిమానులకు అన్నయ్య… ఆప్తులకు ఆపద్బాంధవుడు. అభిమానుల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే రియల్ హీరో. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన తన అభిమాని గుండె జబ్బుతో బాధపడుతుందని తెలిసి చలించిపోయాడు మెగాస్టార్. చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలైన కుమారి రాజనాల వెంకట లక్ష్మిని హైదరాబాద్‌కు రప్పించి ప్రముఖ హాస్పిటల్‌లో చెక్ అప్‌లు చేయించారట. వెంటనే హార్జ్ సర్జరీ […]

Update: 2020-04-07 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆరాధ్యుడు. మరెంతో మందికి స్ఫూర్తి ప్రదాత. తన అభిమానులకు అన్నయ్య… ఆప్తులకు ఆపద్బాంధవుడు. అభిమానుల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే రియల్ హీరో. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన తన అభిమాని గుండె జబ్బుతో బాధపడుతుందని తెలిసి చలించిపోయాడు మెగాస్టార్. చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలైన కుమారి రాజనాల వెంకట లక్ష్మిని హైదరాబాద్‌కు రప్పించి ప్రముఖ హాస్పిటల్‌లో చెక్ అప్‌లు చేయించారట. వెంటనే హార్జ్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో… బుధవారం సర్జరీ జరిగేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయించారట. వైద్యానికి అయిన ఖర్చులు మొత్తం చెల్లించడంతో పాటు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారట చిరు. ఈ విషయాన్ని వెల్లడించిన వెంకట లక్ష్మీ కుటుంబీకులు మెగాస్టార్‌ను దేవుడిగా అభివర్ణించారు. ఒక అభిమాని ఆరోగ్యం పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కారణంగా జీవనోపాధి కోల్పోయిన కార్మికులకు సైతం అండగా నిలిచారు చిరు. కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్న చిరంజీవి… నిరుపేద కళాకారుల ఆకలి తీర్చేందుకు ముందుకు రావడంపై ప్రశంసలు అందుకున్నారు.

Tags: Chirajeevi, Megastar, CCC, Fan, Heart Disease

Tags:    

Similar News