అమితాబ్ మనవరాలితో లింకప్.. జల్సాకు వెళ్తే ఏం జరిగింది?
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ మీజన్ జాఫ్రీతో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి లింకప్ వార్తలు కొంతకాలం హల్చల్ చేశాయి. కాగా ఈ రూమర్స్ వల్ల తామిద్దరి మధ్య రిలేషన్షిప్ ఇబ్బందికరంగా మారిందన్నాడు మీజన్. ఈ విషయాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న యంగ్ యాక్టర్.. ‘నవ్య గురించి నన్నడిగి చాలా కాలమే అయింది. నేను ‘మలాల్’ మూవీ ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే మేమిద్దరం క్లోజ్ […]
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ మీజన్ జాఫ్రీతో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి లింకప్ వార్తలు కొంతకాలం హల్చల్ చేశాయి. కాగా ఈ రూమర్స్ వల్ల తామిద్దరి మధ్య రిలేషన్షిప్ ఇబ్బందికరంగా మారిందన్నాడు మీజన్. ఈ విషయాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న యంగ్ యాక్టర్.. ‘నవ్య గురించి నన్నడిగి చాలా కాలమే అయింది. నేను ‘మలాల్’ మూవీ ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్.
కేవలం నా వల్ల తనపై నెగెటివిటీ స్ప్రెడ్ కావడం అన్యాయం. తనది ప్రైవేట్ లైఫ్, ఇందులో వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినీ ఇన్వాల్వ్ చేయాలనుకోవడం లేదు’ అని మీజన్ తెలిపాడు. ఇక ఆ టైమ్‌లో ముంబైలోని అమితాబ్ ఇంటికి(జల్సా) వెళ్లినపుడు ఏదైనా ఇబ్బంది ఎదురైందా? అన్న ప్రశ్నకు.. మీడియా ఫొటోగ్రాఫర్స్‌కు తన కారు నంబర్ ప్లేట్‌తో సహా తెలుసు కాబట్టి, నవ్యను కలిసేందుకు వెళ్లడం వారికి తెలిసేదని వెల్లడించాడు.
ఆ టైమ్‌లో తన తండ్రి, నటుడు జావేద్ జాఫ్రీ కూడా అసలు ఏం జరుగుతోందని ఆశ్చర్యంగా చూసేవాడని.. ఇంట్లోకి వస్తుంటే పేరెంట్స్ చూపులు ఇబ్బందికరంగా ఉండేవని చెప్పాడు. చివరగా జల్సాకు దివాళీ సందర్భంగా వెళ్లానని, అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉందని గుర్తుచేసుకున్నాడు. తామిద్దరం ఒకే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి వచ్చామని, చెల్లికి బెస్టీ అయిన నవ్య తనకు కూడా మంచి ఫ్రెండ్ తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని క్లారిటీ ఇచ్చాడు. 2018లో వచ్చిన ‘మలాల్’ మూవీ మీజన్కు డెబ్యూ కాగా, ప్రస్తుతం ‘హంగామా2’లో నటిస్తున్నాడు.