క్రొకడైల్ జర్నీ… నేపాల్ టు ఇండియా 1,100 కి.మీ.
దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకునేందుకు వందలాది కిలోమీటర్లు నడుస్తున్న విషయం తెలిసిందే. విచిత్రంగా ఓ మొసలి కూడా నేపాల్ నుంచి ఇండియాకు ప్రయాణించడం ఆసక్తిని కలిగిస్తోంది. దాదాపు 1,100 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మొసలి.. కోల్‌కతాలోని హుగ్లీకి చేరువలోని రాణీ నగర్ ఘాట్‌లో జాలర్లకు చిక్కింది. నేపాల్ నుంచి ఇండియా చేరుకున్న ఈ మొసలి ఘరియల్ జాతికి చెందినది. ఈ జాతి మొసళ్లు ఇప్పటికే అంతరించిపోతున్న జీవాల జాబితాలో […]
దిశ, వెబ్‌డెస్క్ :
లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకునేందుకు వందలాది కిలోమీటర్లు నడుస్తున్న విషయం తెలిసిందే. విచిత్రంగా ఓ మొసలి కూడా నేపాల్ నుంచి ఇండియాకు ప్రయాణించడం ఆసక్తిని కలిగిస్తోంది. దాదాపు 1,100 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మొసలి.. కోల్‌కతాలోని హుగ్లీకి చేరువలోని రాణీ నగర్ ఘాట్‌లో జాలర్లకు చిక్కింది.
నేపాల్ నుంచి ఇండియా చేరుకున్న ఈ మొసలి ఘరియల్ జాతికి చెందినది. ఈ జాతి మొసళ్లు ఇప్పటికే అంతరించిపోతున్న జీవాల జాబితాలో ఉన్నాయి. ఇవి చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఇండియాలోని చంబల్ ప్రాంతంలో ఈ తరహా మొసలిని చూసి అధికారులు ఇది ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు. అలా అసలు విషయం బయటకు వచ్చింది. నేపాల్‌కు చెందిన కొందరు అధికారులు కొన్ని రోజుల కిందట ఆ దేశంలోని రాప్తి నదిలో దీన్ని విడిచి పెట్టారట. అయితే ఈ మొసలి రాప్తి నుంచి గందక్, గంగా, ఫరాక్కా మీదుగా హుగ్లీ దాకా చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడికి చేరుకోడానికి ఆ మొసలికి 61 రోజుల సమయం పట్టింది. దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ఆ మొసలి నేపాల్‌కు చెందినదిగా భారత శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీని గురించి తెలియజేస్తూ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా ఘరియల్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇండియాలోని చంబల్, గిర్వా, సన్ రివర్స్ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. ఇక నేపాల్‌లో నారాయణి రివర్ దగ్గర నివసించే ఈ మొసళ్లు.. 12 నుంచి 15 అడుగుల పొడవుంటాయి. '1940 నుంచే ఈ తరహా మొసళ్లను అంతరించిపోయే జాబితాలో చేర్చగా.. వీటిని సంరక్షించడంతో పాటు సంతతిని వృద్ధి చేసేందుకు 1970లో ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంది.
You may be under #lockdown but this #gharial travelled 1100km from #Nepal to Hooghly! Read more here: https://t.co/JDHETRRhhv #CriticallyEndangered #savingspecies@vivek4wild @LAZoo pic.twitter.com/rdbHntRShM
— Wildlife Trust India (@wti_org_india) May 25, 2020