విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు

Update: 2024-12-20 11:19 GMT

దిశ, ఆర్మూర్ : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ మెరుగైన విద్యను బోధించాలన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. కొత్త డైట్, పెరిగిన కాస్మొటిక్ చార్జెస్ గురించి విద్యార్థులను అడిగి, వాళ్ళ అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకున్నారు. అలాగే పాఠశాల పరిసరాలను, వంటగది, స్టోర్ రూమ్, బాత్రూమ్స్ లను పరిశీలించి తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ  తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రిక ,సీనియర్ అసిస్టెంట్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.


Similar News