ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న బాలిక మృతి
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసాని పేట్‌కు చెందిన అలీనా అనే విద్యార్థిని జాండీస్ తో శుక్రవారం మృతి చెందింది.
దిశ ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసాని పేట్‌కు చెందిన అలీనా అనే విద్యార్థిని జాండీస్ తో శుక్రవారం మృతి చెందింది. అలీనా కామారెడ్డి మైనార్టీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు తండ్రి రఫీక్ తెలిపారు.కొద్దిరోజుల క్రితం విద్యార్థినికి జాండీస్ సోకడంతో..చికిత్సల నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. విద్యార్థి మృతదేహానికి ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్,నాయకులు సాయిబాబా, రాజు, విద్యార్థులు,ఉపాధ్యాయులు, గ్రామస్థులు నివాళులర్పించారు. విద్యార్థిని ఇటీవలే కలెక్టర్,మున్సిపఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న బాలిక మృతిల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా ఉత్తమ విద్యార్థి అవార్డును అందుకుంది.