మహిళల ‘న్యూ స్పిరిట్స్’

దిశ, ఫీచర్స్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలుసు.. కానీ ఇది అబ్బాయిలకు మాత్రమే అని ఎక్కడా, ఎప్పుడూ కనపడని డిస్‌క్లెయిమర్. మగువలు మందుకు దూరం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆల్కహాల్స్ తయారుచేయడంలో ఆ కంపెనీలను లీడ్ చేయడంలో తమకు సాటిలేరని నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆల్కహాల్ కంపెనీలైన డియాజియో, మోయెట్ హెన్నెస్సీలతో పాటు అనేక మల్టీనేషనల్ బేవరేజ్ కంపెనీల్లో మహిళలు కీలక స్థానాల్లో ఉన్నారు. అయితే భారతీయ ఆల్కోబేవరేజెస్ పరిశ్రమలో కూడా ఇప్పుడిప్పుడే […]

Update: 2021-08-10 21:56 GMT

దిశ, ఫీచర్స్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలుసు.. కానీ ఇది అబ్బాయిలకు మాత్రమే అని ఎక్కడా, ఎప్పుడూ కనపడని డిస్‌క్లెయిమర్. మగువలు మందుకు దూరం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆల్కహాల్స్ తయారుచేయడంలో ఆ కంపెనీలను లీడ్ చేయడంలో తమకు సాటిలేరని నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆల్కహాల్ కంపెనీలైన డియాజియో, మోయెట్ హెన్నెస్సీలతో పాటు అనేక మల్టీనేషనల్ బేవరేజ్ కంపెనీల్లో మహిళలు కీలక స్థానాల్లో ఉన్నారు. అయితే భారతీయ ఆల్కోబేవరేజెస్ పరిశ్రమలో కూడా ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఇది వైవిధ్యాన్ని మాత్రమే కాదు స్పిరిట్స్ ఇండస్ట్రీ స్పేస్‌లో వారి ప్రాధాన్యతను కూడా పెంచుతోంది. అయితే పురుషాధిపత్యమున్న ఈ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలు ప్రవేశించడానికి ఇది సవాలుతో కూడిన ప్రదేశం కాగా.. యంగ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్‌ మాత్రం న్యూ లిక్కర్ బ్రాండ్స్‌తో సంప్రదాయ మనస్తత్వ భావాల మత్తు వదిలిస్తున్నారు.

‘జీవితంలో ఏదో సాధించాలనే ఆలోచనతో సీరియస్‌గా ప్రణాళికలు రచిస్తుంటాం కానీ డెస్టినీ మనకు మరో దారి చూపెడుతోంది’ అని ఓ మహానుభావుడు అన్నట్లు.. అకాడమిక్స్‌లో అద్భుత ప్రతిభ చూపించి, సివిల్ సర్వెంట్‌గా సత్తా చాటాల్సిన ఆస్పిరెంట్ వర్ణ బట్.. బ్రాండింగ్ ఎక్స్‌పెర్ట్‌గా, సీరియల్ ఆంత్రప్రెన్యూర్‌గా మారడం లైఫ్ స్క్రీన్ ప్లే అనుకోవాలేమో! సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఓ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేసింది. అక్కడే వరల్డ్‌క్లాస్ బ్రాండింగ్ మెంటార్స్ నుంచి మెళకువలు నేర్చుకుంది. ఆ అనుభవాలతో ‘రాపిడ్‌స్టాల్’ అనే తొలి వెంచర్ ప్రారంభించింది. ఇది ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ తర్వాత మార్కెటింగ్ ఏజెన్సీ ‘టెస్సరాక్ట్ ఎక్స్‌పీరియన్షియల్’ను ప్రారంభించింది. ఈ రెండు వ్యాపారాలు సూపర్ సక్సెస్‌గా సాగుతున్న క్రమంలోనే ‘బ్లిస్ వాటర్ ఇండస్ట్రీస్’కు పునాది పడింది.

తన స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఇండియా-స్టైల్‌ను రిప్రజెంట్ చేసే ఆల్కహాల్ బేవరేజ్ లేదని గ్రహించింది. అప్పటికీ స్థానికంగా లభించే అపాంగ్, ఫెని, మహువా ఉండగా పాన్-ఇండియన్‌కు చెందిన ఆల్కహాలిక్ డ్రింక్ ఉంటే బాగుంటుందనే ఆలోచనల్లోంచి ‘రహస్య వోడ్కా’ పురుడుపోసుకుంది. దాంతో అనేకమంది మిక్సాలజిస్టులను కలిసి విభిన్న స్పిరిట్స్, కాక్‌టెయిల్లను ప్రయత్నించింది. వాటిలో ఇండియన్ ఎలిమెంట్ ఉండేలా దాన్ని రూపొందించాలని డిసైడ్ కాగా.. అనేక ప్రయోగాల అనంతరం దాదాపు 90 శాతం మంది కస్టమర్స్ ‘ఇండియన్’ డ్రింక్‌గా గుర్తించే వోడ్కాను రూపొందించింది. దానికి ఓ సీక్రెట్ సాస్ యాడ్ చేసి ఫ్లేవర్‌ను మరింత పెంచింది. అందుకే వర్ణ దానికి ‘రహస్య’ వోడ్కా అని పేరు పెట్టి 2021 జనవరి గోవాలో విడుదల చేసింది.

బ్లెండర్‌గా బ్యాంకర్

ఆర్థిక సేవల్లో 14 ఏళ్ల కెరీర్ నుంచి తప్పుకుని అనూహ్యంగా బార్‌టెండర్‌గా మారింది కస్తూరి బెనర్జీ. ఆ క్రమంలో బ్లెండర్‌గా మారిన ఆమె, భారతీయ వినియోగదారులకు స్థానిక క్రాఫ్ట్ రమ్‌ను అందించాలనే ఉద్దేశంతో ‘మకా జై’ను 2021 జనవరిలో లాంచ్ చేసింది. మకా జై అంటే కొంకణిలో ‘నాకు కావాలి’ అని అర్థం కాగా వీటిలో బార్‌టెండర్, గోల్డ్ రమ్ ట్రిబ్యూట్ ఎడిషన్స్ తీసుకొచ్చింది. అరుదైన సముద్ర జీవి ఆలివ్ రిడ్లీ తాబేలుకు సంకేతంగా మకా జై రంగురంగుల లేబుల్‌పై దాని ఫొటో ఉంటుంది. ఈ ఉత్పత్తిని ప్రారంభించే ముందు దేశవ్యాప్తంగా ఉన్న డిస్టిలరీల నుంచి చాలా స్పిరిట్ శాంపిల్స్‌ను సేకరించింది. చివరకు కొల్లాపూర్ నుంచి మొలాసిస్ ఆధారిత కేన్ స్పిరిట్‌తో పాటు, ఉత్తర భారతదేశం నుంచి బారెల్-ఏజ్డ్ కేన్ స్పిరిట్‌‌లను రమ్ తయారీకి ఉపయోగించింది. వైట్ రమ్ మహారాష్ట్రలోని పంచగంగా నది చుట్టూ పెరుగుతున్న చెరకు నుంచి తయారవుతుంది. ఇక్కడి ఎర్రమట్టిలోని వైవిధ్యం వల్ల రమ్ టేస్ట్ మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఇక గోల్డ్ రమ్ రుచి కూడా ఇండియన్ ఫ్లేవర్స్‌తో సూపర్ కిక్ ఇస్తుందని బెనర్జీ తెలిపింది.

జిన్ మ్యాట్నీ

సింగపూర్‌లో బిజినెస్ డిగ్రీ చేస్తున్న సమయంలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ జిన్ తాగుతున్న సమయంలో అంజలి షాహి, లావణ్య జయశంకర్‌లు తమ సొంత బ్రాండ్‌తో ఆల్కహాల్ రూపొందిస్తామని ఊహించి ఉండరు. కానీ 2021లో ఆ ఇద్దరూ ‘జిన్ మ్యాట్నీ’పేరుతో భారతీయ ఫ్లేవర్స్‌తో జిన్‌ను ఉత్పత్తి చేశారు. లండన్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడి రెస్టారెంట్లలో దాదాపు 300లకు పైగా జిన్ బ్రాండ్స్ ఉండగా.. ఇండియాకు చెందిన బ్లూ రిబాండ్ ఒక్కటి మాత్రమే ఉంది. అయితే ఆ విదేశీ బ్రాండ్స్ అన్నీ కూడా జిన్ తయారీలో చాలా వరకు భారతీయ మసాలా దినుసులనే ఉపయోగించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ మిత్రద్వయం.. స్నేక్ సఫ్రాన్, వైట్ టర్మెరిక్, కాగ్జీ లైమ్, గోవా పెప్పర్‌కార్న్ వంటి విలక్షణమైన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ‘మ్యాట్నీ’ జిన్ తయారుచేశారు. ఈ సంవత్సరం ముగింపులోపు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, చండీగఢ్‌లో తమ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మూడు బ్రాండ్స్ ప్రస్తుతం గోవాలో మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే తమ బిజినెస్ విస్తరణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోనూ లభించనున్నాయి.

Tags:    

Similar News