బల్దియా పరిధిలో 2.50 కోట్ల మొక్కలు నాటుతాం: మేయర్
దిశ, న్యూస్బ్యూరో: బల్దియాలో హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తిచేశామని మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు. బుధవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, బయోడైవర్సిటీ విభాగం అదనపు కమిషనర్ కృష్ణతో కలిసి జూబ్లీహిల్స్ విజయ నర్సరీని సందర్శించారు. నర్సరీలో వివిధ బ్లాకులుగా పెంచుతున్న 3లక్షల మొక్కలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హరితహారం కింద జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఏడాదిలో 2కోట్ల 50లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 150వార్డుల్లో ‘వార్డుస్థాయి […]
దిశ, న్యూస్బ్యూరో: బల్దియాలో హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తిచేశామని మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు. బుధవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, బయోడైవర్సిటీ విభాగం అదనపు కమిషనర్ కృష్ణతో కలిసి జూబ్లీహిల్స్ విజయ నర్సరీని సందర్శించారు. నర్సరీలో వివిధ బ్లాకులుగా పెంచుతున్న 3లక్షల మొక్కలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హరితహారం కింద జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఏడాదిలో 2కోట్ల 50లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 150వార్డుల్లో ‘వార్డుస్థాయి హరితహర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో కాలనీ అసోసియేషన్లు, సంక్షేమ సంఘాలను భాగస్వాములను చేయనున్నట్లు పేర్కొన్నారు.
దట్టమైన అడవుల ఏర్పాటుకు 75చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టడంతో పాటు 700ట్రీ పార్కులను అభివృద్ధి చేస్తామని మేయర్ తెలిపారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కింద కూకట్‌పల్లి జోన్ బోరంపేట, రామారం, సూరారం రిజర్వ్ ఫారెస్ట్ క్లస్టర్‌లో ఉన్న 455ఎకరాల్లో 11లక్షల 70వేల 948 మొక్కలు, ఎల్బీనగర్ జోన్ నాదర్‌గుల్ రిజర్వ్ పారెస్ట్ క్లస్టర్‌లో ఉన్న 42ఎకరాల్లో 5లక్షల మొక్కలను, చార్మినార్ జోన్ మాదన్నగూడ రిజర్వ్ పారెస్ట్ బ్లాక్‌లో ఉన్న 97ఎకరాల్లో 2లక్షల 50వేల మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. ఈ మూడు బ్లాక్‌లను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ది చేసేందుకు మొత్తం 19లక్షల 20వేల 948మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.