నర్సులకు మాస్క్‌ల పంపిణీ..
దిశ, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్ -19 సేవలందిస్తున్న నర్సులకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నగరంలోని ఈఎన్టీ, చెస్ట్, ఈఎస్ఐ, ఫీవర్, కింగ్ మెటర్నిటీ ఆస్పత్రుల్లో నర్సులకు వీటిని అందించారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రుడావత్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19 వైరస్‌తో ప్రత్యక్ష యుద్ధం చేస్తోన్న వారిలో నర్సులు అగ్రభాగాన నిలుస్తున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వం, సమాజం నుంచి నైతిక మద్దతు ప్రకటించాల్సిన […]
దిశ, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్ -19 సేవలందిస్తున్న నర్సులకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నగరంలోని ఈఎన్టీ, చెస్ట్, ఈఎస్ఐ, ఫీవర్, కింగ్ మెటర్నిటీ ఆస్పత్రుల్లో నర్సులకు వీటిని అందించారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రుడావత్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19 వైరస్‌తో ప్రత్యక్ష యుద్ధం చేస్తోన్న వారిలో నర్సులు అగ్రభాగాన నిలుస్తున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వం, సమాజం నుంచి నైతిక మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ -19 వార్డుల్లో పనిచేసే నర్సులకు మాస్కులు, శానిటైజర్లను అందజేసేందుకు ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఇండియా, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ వారు సహకరించారని లక్ష్మణ్ కోరారు. కార్యక్రమంలో ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ రాజేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సలహాదారులు డాక్టర్ రామ్ తిలక్, తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షులు రామలక్ష్మీ, ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.
Tags : Corona, Masks, Sanitisers, Nursing officers Association, Distribution