ఇన్‌బిల్ట్ మైక్, యాంప్లిఫైయర్స్‌తో.. స్మార్ట్ మాస్క్

దిశ, ఫీచర్స్ : ఫస్ట్ వేవ్ నుంచి రాబోయే థర్డ్ వేవ్ వరకు మహమ్మారి నుంచి మానవులకు రక్షణ కల్పిస్తున్న ఏకైక ఆయుధం ‘మాస్క్’. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్నా తప్పనిసరిగా ‘మాస్క్’ ధరించాలని డాక్టర్లు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే మాస్క్‌లు మన స్వర శబ్ధాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు ధృవీకరించాయి. అందుకే మనం మాట్లాడుతుంటే, అవతల వ్యక్తికి చిన్నగా వినిపించడమే కాక స్పష్టత లోపిస్తుంది. కాగా కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన 19 ఏళ్ల కెవిన్ […]

Update: 2021-05-19 08:19 GMT

దిశ, ఫీచర్స్ : ఫస్ట్ వేవ్ నుంచి రాబోయే థర్డ్ వేవ్ వరకు మహమ్మారి నుంచి మానవులకు రక్షణ కల్పిస్తున్న ఏకైక ఆయుధం ‘మాస్క్’. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్నా తప్పనిసరిగా ‘మాస్క్’ ధరించాలని డాక్టర్లు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే మాస్క్‌లు మన స్వర శబ్ధాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు ధృవీకరించాయి. అందుకే మనం మాట్లాడుతుంటే, అవతల వ్యక్తికి చిన్నగా వినిపించడమే కాక స్పష్టత లోపిస్తుంది. కాగా కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన 19 ఏళ్ల కెవిన్ జాకబ్ ఓ అద్భుతమైన ఆవిష్కరణతో దీనికి పరిష్కారం చూపించడం విశేషం.

సాధారణ ప్రజల సంగతి పక్కనపెడితే, వైద్యులు నిరంతరం పేషెంట్లతో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే మాస్క్ వల్ల కమ్యూనికేషన్ లోపిస్తుండటంతో గట్టిగా అరవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కాగా తన తల్లిదండ్రులు(డాక్టర్లు) సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన కెవిన్ జాకబ్.. కొత్త రకమైన మాస్క్‌తో ముందుకొచ్చాడు. ఇన్‌బిల్ట్‌ స్పీకర్, యాంప్లిఫైయర్‌తో కూడిన స్పెషల్ ‘మాస్క్‌ మైక్స్’‌ను 3డీ ప్రింటర్ సాయంతో రూపొందించిన కెవిన్.. దీనికి చార్జింగ్ అందించే సర్క్యూట్ బోర్డులను ఏర్పాటు చేశాడు. ఈ స్మార్ట్ మాస్క్‌లోని యాంప్లిఫైయర్ 6.3 సెం.మీ పొడవు, 3 సెం.మీ వెడల్పు, 0.5 సెం.మీ. థిక్‌నెస్ కలిగి ఉండగా.. మైక్రో యూఎస్‌బీ కేబుల్ ఉపయోగించి 45 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు. ఇక స్పీకర్‌తో పాటు యాంప్లిఫైయర్ (ఒకే యూనిట్) ఫేస్ షీల్డ్ మీద ఉంటాయి. వినియోగదారుడు మాస్క్ మాత్రమే ధరిస్తే.. మైక్ ఒక వైపున, మరొక వైపున యాంప్లిఫైయర్ ఉంచవచ్చు. దీని ధర రూ. 900/-

అమ్మానాన్న ఇద్దరూ మెట్రోపాలిటన్ ఆస్పత్రిలో పనిచేస్తారు. రోగులతో మాట్లాడేటప్పుడు మాస్క్ ధరించి ఉండటం వల్ల గొంతు పెంచాల్సి రావడంతో నొప్పితో బాధపడుతున్నారు. తమ రోజు వారీ జీవితాల్లో చాలా మంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మైక్, స్పీకర్లతో అమర్చిన మాస్క్ నమూనాను అభివృద్ధి చేశాను. దీని సాయంతో వినియోగదారులు సాధారణంగా మాట్లాడినా ఎదుటివారికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక స్మార్ట్ మాస్క్‌లో ఉపయోగించిన మైక్, స్పీకర్లు చాలా తేలికైనవి. మార్కెట్‌లో చాలా ఎక్కువ ధరకు లభిస్తుండటంతో స్వయంగా నేనే తయారు చేశాను.
– కెవిన్

 

Tags:    

Similar News