కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచనున్నట్టు స్పష్టం చేసింది. ముడి పదార్థాల వ్యయం అధికంగా మారడంతో వాహనాలపై ఈ ధరల భారం తప్పడంలేదని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో పలు మోడళ్లపై ఈ ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. గతేడాది కాలంగా ముడి పదార్థాల వ్యయం భారంగా మారిందని, దీనివల్ల వాహనాల తయారీలో ఖర్చులు పెరుగుతున్నాయని, ఈ వ్యయాన్ని […]

Update: 2021-06-21 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచనున్నట్టు స్పష్టం చేసింది. ముడి పదార్థాల వ్యయం అధికంగా మారడంతో వాహనాలపై ఈ ధరల భారం తప్పడంలేదని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో పలు మోడళ్లపై ఈ ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. గతేడాది కాలంగా ముడి పదార్థాల వ్యయం భారంగా మారిందని, దీనివల్ల వాహనాల తయారీలో ఖర్చులు పెరుగుతున్నాయని, ఈ వ్యయాన్ని తగ్గించేందుకు వినియోగదారులపై అదనపు భారాన్ని మళ్లించక తప్పదని కంపెనీ వివరించింది.

వాహనాలపై ధరల పెంపు మోడళ్లను బట్టి వేర్వేరుగా ఉంటాయని, ఏ ఏ మోడళ్లపై పెరుగుదల ఉంటుందనేది త్వరలో ప్రకటించనున్నట్టు పేర్కొంది. కాగా, మారుతీ సుజుకి ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో పలు మోడళ్లపై రూ. 34 వేల వరకు ధరల పెంపు ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మోడళ్లను బట్టి 1.6 శాతం మేర ధరలను పెంచగా.. ముడి పదార్థాల వ్యయం కారణంగానే ధరలను పెంచినట్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News