ఈ మోడల్ కారుపై మరోసారి ధరలు పెంచిన మారుతీ సుజుకి..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన నాన్-కార్గో వేరియంట్ ఈకో వాహన ధరను రూ.8,000 పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్యాసింజర్ సీట్‌లో ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం ప్రవేశపెట్టిన కారణంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మారుతీ సుజుకి అధిక ఇన్‌పుట్ ఖర్చులతో పాటు సెమీకండక్టర్ల కొరత కారణంగా జనవరిలో ఎంపిక మోడళ్లపై రూ. 34,000, ఏప్రిల్‌లో 1.6 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన నాన్-కార్గో వేరియంట్ ఈకో వాహన ధరను రూ.8,000 పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్యాసింజర్ సీట్‌లో ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం ప్రవేశపెట్టిన కారణంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మారుతీ సుజుకి అధిక ఇన్‌పుట్ ఖర్చులతో పాటు సెమీకండక్టర్ల కొరత కారణంగా జనవరిలో ఎంపిక మోడళ్లపై రూ. 34,000, ఏప్రిల్‌లో 1.6 శాతం మేర ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది.
అనంతరం సెప్టెంబర్‌లో వాహనాల ధరలను 1.9 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చెబుతోంది. చిప్‌ల కొరత వల్ల ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకి 1,16,000 వాహనాల ఉత్పత్తిని తగ్గించినట్టు వెల్లడించింది.