గాల్వాన్ ఘర్షణలకు ముందే చైనా ప్లాన్?
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణలకు ముందు చైనాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు సరిహద్దుకు చేరారు. ఐదు కొత్త మిలీషియా డివిజన్లలో భాగంగా వీరు సరిహద్దుకు తరిలారు. ఇందులో మౌంట్ ఎవరెస్ట్ ఒలంపిక్ టార్చ్ రిలే టీం మాజీ సభ్యులు, పలుమార్షల్ ఆర్ట్స్ క్లబ్ సభ్యులూ ఉన్నట్టు చైనా జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది. వీరంతా జూన్ 15న ఇన్‌స్పెక్షన్ కోసం ల్హాసాలో ఉన్నట్టు అధికారిక మిలిటరీ న్యూస్ పేపర్ చైనా నేషనల్ డిఫెన్స్ […]
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణలకు ముందు చైనాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు సరిహద్దుకు చేరారు. ఐదు కొత్త మిలీషియా డివిజన్లలో భాగంగా వీరు సరిహద్దుకు తరిలారు. ఇందులో మౌంట్ ఎవరెస్ట్ ఒలంపిక్ టార్చ్ రిలే టీం మాజీ సభ్యులు, పలుమార్షల్ ఆర్ట్స్ క్లబ్ సభ్యులూ ఉన్నట్టు చైనా జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది. వీరంతా జూన్ 15న ఇన్‌స్పెక్షన్ కోసం ల్హాసాలో ఉన్నట్టు అధికారిక మిలిటరీ న్యూస్ పేపర్ చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ పత్రిక ప్రకారం, ఎన్బో ఫైట్ క్లబ్ నియమించినవారి వల్ల సైన్యం బలోపేతమవుతుందని, చురుకుగా స్పందించేందుకు దోహదమవుతుందని టిబెట్ కమాండర్ వాంగ్ హాయిజియాంగ్ అభిప్రాయపడ్డారు. అయితే, వీరి మోహరింపునకు, ఘర్షణలతో సంబంధాలపై నేరుగా ఆయనేమీ మాట్లాడలేదు.