అంగారకుడి చుట్టూ ఆకుపచ్చ కాంతి

అరుణ గ్రహం చుట్టూ ఆకుపచ్చ కాంతి ఒకటి అలుముకున్నట్లుగా ఉన్న ఓ దృగ్విషయాన్ని యూరోపియన్ అంతరిక్షనౌక కనిపెట్టింది. భూమ్మీద కాకుండా ఇలాంటి పరిణామం విశ్వంలో కనిపించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వారి ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ ఈ ఆకుపచ్చ కాంతిని ఫొటోలో బంధించింది. అంగారకుని ఉపరితలం మీది ఆక్సిజన్ అణువులు, సూర్యరశ్మితో చర్యనొంది ఇలా ఆకుపచ్చ కాంతి వలయం మాదిరిగా కనిపిస్తున్నాయి. గతంలో భూమి చుట్టూ కూడా ఇలాంటి ఆకుపచ్చ వలయాన్ని […]

Update: 2020-06-18 04:23 GMT

అరుణ గ్రహం చుట్టూ ఆకుపచ్చ కాంతి ఒకటి అలుముకున్నట్లుగా ఉన్న ఓ దృగ్విషయాన్ని యూరోపియన్ అంతరిక్షనౌక కనిపెట్టింది. భూమ్మీద కాకుండా ఇలాంటి పరిణామం విశ్వంలో కనిపించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వారి ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ ఈ ఆకుపచ్చ కాంతిని ఫొటోలో బంధించింది. అంగారకుని ఉపరితలం మీది ఆక్సిజన్ అణువులు, సూర్యరశ్మితో చర్యనొంది ఇలా ఆకుపచ్చ కాంతి వలయం మాదిరిగా కనిపిస్తున్నాయి. గతంలో భూమి చుట్టూ కూడా ఇలాంటి ఆకుపచ్చ వలయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు గుర్తించారు. అది కొద్దిగా పాలిపోయినట్లుగా ఉండటం, ఈ అంగారకుని వలయం మాత్రం పూర్తి ఆకుపచ్చగా ఉండటం వెనక ఆక్సిజన్ అణువుల గాఢతే కారణమని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News