దుమ్మురేపిన మార్కరమ్

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కెప్ జట్టు జొహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టుపై 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరింది.

Update: 2023-02-10 05:51 GMT

ఫైనల్ కు చేరిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కెప్

దిశ, వెబ్ డెస్క్: సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కెప్ జట్టు జొహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టుపై 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జొహన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలోని సన్ రైజర్స్ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో విలియమ్స్ తన అద్భుత బౌలింగ్ తో వరుసగా బవూమా, రోసిగ్టన్ లను పెవిలయన్ కే చేర్చాడు. దీంతో 10 పరుగులకే 2 వికెట్లు ఈ దశలో క్రీజులోకి వచ్చిన జట్టు కెప్టెన్ మార్కరమ్ (58 బంతుల్లో 100; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి తోడుగా జోర్డాన్ హెర్మాన్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 99 పరుగులు జోడించాడు. అయితే కీలక సమయంలో సమన్వయ లోపం కారణంగా జోర్డాన్ రనౌట్ అయ్యాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడుతూ వచ్చిన మార్కరమ్ తన దైన శైలిలో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించాడు. స్టేడియం మొత్తం సిక్సర్ల మోత మోగించాడు. అదేవిధంగ స్టబ్స్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్ కు వేగంగా 75 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 19వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన మార్కరమ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం వెనువెంటనే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మార్కరమ్, స్టబ్స్ వికెట్లను కోల్పోయి 213 రన్ ల టార్గట్ ను ఫిక్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జొహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టు మొదటి బంతికే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ వికేట్ ను కోల్పోయింది. ఆ జట్టులో రేజా హెండ్రిక్స్ (54 బంతుల్లో 96; 11 ఫోర్లు, 4 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా అతని శ్రమ వృథా అయ్యింది. సరైన భాగస్వామ్యం లేక 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కెప్ జట్టు 14 పరుగులతో గెలుపొంది, జొహన్నస్ బర్గ్ లో జరుగనున్న ఫైనల్ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్ తో తలపడనుంది. 

Tags:    

Similar News