ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ హతం

దిశ, ఖమ్మం : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతలు హతమయ్యారు. గదిరాస్​ పరిధిలోని మంకపల్​ వద్ద జిల్లా రిజర్వు గార్డ్‌, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దళాలు మావోయిస్టుల కోసం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్యలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించగా, వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాల్పుల్లో […]

Update: 2020-05-23 07:38 GMT

దిశ, ఖమ్మం :
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతలు హతమయ్యారు. గదిరాస్​ పరిధిలోని మంకపల్​ వద్ద జిల్లా రిజర్వు గార్డ్‌, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దళాలు మావోయిస్టుల కోసం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్యలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించగా, వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాల్పుల్లో మరణించిన గంధధుర్​ అనే నక్సల్ తలపై రూ.5లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News