బిగ్‌బ్రేకింగ్ : మావోయిస్టు అగ్రనేత రంజిత్ లొంగుబాటు
దిశ, వెబ్‌డెస్క్ : మరో మావోయిస్టు అగ్రనేత పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతపై ప్రధానంగా దృష్టి సారించగా వరుసగా అడవిని వీడి జనబహుళ్యంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కొందరు మావోయిస్టులు కొవిడ్ బారిన పడి మరణించడంతో మరి కొందరు వైద్యం కోసం లొంగిపోయారు. ఆరోగ్యం సహకరించక కూడా కొందరు అడవిని వీడుతున్నట్లు సమాచారం. తాజాగా మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈయన మావోయిస్టు సెంట్రల్ కమిటీ […]
దిశ, వెబ్‌డెస్క్ : మరో మావోయిస్టు అగ్రనేత పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతపై ప్రధానంగా దృష్టి సారించగా వరుసగా అడవిని వీడి జనబహుళ్యంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కొందరు మావోయిస్టులు కొవిడ్ బారిన పడి మరణించడంతో మరి కొందరు వైద్యం కోసం లొంగిపోయారు. ఆరోగ్యం సహకరించక కూడా కొందరు అడవిని వీడుతున్నట్లు సమాచారం.
తాజాగా మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈయన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీకాంత్ కుమారుడు. ప్రస్తుతం రంజిత్ బెటాలియన్ చీఫ్‌గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రావుల రంజిత్ లొంగుబాటు విషయాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. కాగా, ఆయన లొంగిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.