దండకారణ్యంలో తుపాకుల మోత.. మావోయిస్టు మృతి

దిశ, భద్రాచలం: ఛ‌త్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మరణించాడు. ఈ ఘటనని సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ ధృవీకరించారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సుక్మా జిల్లా చింతాగుఫా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, డీఆర్‌జి, ఎస్‌టిఎఫ్ […]

Update: 2021-07-25 01:08 GMT

దిశ, భద్రాచలం: ఛ‌త్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మరణించాడు. ఈ ఘటనని సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ ధృవీకరించారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సుక్మా జిల్లా చింతాగుఫా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, డీఆర్‌జి, ఎస్‌టిఎఫ్ భద్రతా దళాలు వెళ్ళి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో మావోయిస్టులు తాసరపడి పోలీసుల వైపు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు ఆగిన తర్వాత సంఘటన ప్రాంతంలో పోలీసులు ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక బర్మార్ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో
తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News