మావోయిస్ట్ కొరియర్ అరెస్ట్

దిశ, ములుగు: మావోయిస్ట్‎లకు పార్టీ ఫండ్ పేరిట డబ్బులు చేరవేస్తున్న కొరియర్‎ను అరెస్ట్ చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు నిందితుడి వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లాకు చెందిన కారం జగపతి మావోయిస్ట్ కొరియర్‎గా పని చేస్తున్నాడు. కాంట్రాక్టర్ల వద్ద పార్టీ ఫండ్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అగ్రనాయకులకు చేరవేస్తున్నాడు. ఈ క్రమంలోనే వెంకటాపురం మండలం తిప్పాపురం వద్ద జగపతిని పోలీసులు అదుపులోకి […]

Update: 2020-06-27 08:51 GMT

దిశ, ములుగు: మావోయిస్ట్‎లకు పార్టీ ఫండ్ పేరిట డబ్బులు చేరవేస్తున్న కొరియర్‎ను అరెస్ట్ చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు నిందితుడి వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లాకు చెందిన కారం జగపతి మావోయిస్ట్ కొరియర్‎గా పని చేస్తున్నాడు. కాంట్రాక్టర్ల వద్ద పార్టీ ఫండ్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అగ్రనాయకులకు చేరవేస్తున్నాడు. ఈ క్రమంలోనే వెంకటాపురం మండలం తిప్పాపురం వద్ద జగపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 17.40 లక్షల నగదు, మోటార్ బైక్, విప్లవ సాహిత్యం బుక్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు హరి భూషణ్, బడే దామోదర్, కంకణాల రాజిరెడ్డి, శారద, అజాద్, కొయ్యడ సాంబయ్య అనే అగ్ర నాయకులకు పార్టీ ఫండ్ అందజేసే వాడని ఎస్పీ వెల్లడించారు. అతడితో పాటు కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Tags:    

Similar News