మావో వ్యతిరేక వాల్ పోస్టర్ల కలకలం

దిశ, కాటారం: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. మహాముత్తారం మండలం గండికామారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏకంగా స్థూపాలపైనా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఒకప్పుటి మావోల ఇలాఖాలో వ్యతిరేక వాల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని ప్రగతి నిరోధకులుగా మావోయిస్టులు తయారయ్యారని వాల్ పోస్టర్లలో ముద్రించారు. ఇటీవల మహాముత్తారం మండలం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్న క్రమంలో […]

Update: 2020-08-29 09:49 GMT

దిశ, కాటారం: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. మహాముత్తారం మండలం గండికామారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏకంగా స్థూపాలపైనా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఒకప్పుటి మావోల ఇలాఖాలో వ్యతిరేక వాల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని ప్రగతి నిరోధకులుగా మావోయిస్టులు తయారయ్యారని వాల్ పోస్టర్లలో ముద్రించారు.

ఇటీవల మహాముత్తారం మండలం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్న క్రమంలో వారికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా, పొరుగునే ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతం నుండి మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతంపై గట్టి నిఘా వేశారు.

Tags:    

Similar News