విశ్వాసాన్ని గెలుచుకున్న మణిపూర్ సీఎం
గువహతి: మణిపూర్ సీఎం ఎన్ బీరేంద్ర సింగ్ అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని గెలుపొందారు. సీఎంకు మద్దతుగా చట్టసభ్యులు ముజువాణి ద్వారా మద్దతు పలుకగా బీజేపీ నేతృత్వంలోని కూటమే అధికారాన్ని నిలుపుకున్నది. కాగా, ఈ ఓటింగ్‌లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మాజీ బీజేపీ నేత ప్రమేయమున్నట్టు భావిస్తున్న డ్రగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను సర్కారు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ గతనెల 28న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తన బలాన్ని […]
గువహతి: మణిపూర్ సీఎం ఎన్ బీరేంద్ర సింగ్ అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని గెలుపొందారు. సీఎంకు మద్దతుగా చట్టసభ్యులు ముజువాణి ద్వారా మద్దతు పలుకగా బీజేపీ నేతృత్వంలోని కూటమే అధికారాన్ని నిలుపుకున్నది. కాగా, ఈ ఓటింగ్‌లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
మాజీ బీజేపీ నేత ప్రమేయమున్నట్టు భావిస్తున్న డ్రగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను సర్కారు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ గతనెల 28న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తన బలాన్ని నిరూపించుకునే తీర్మానాన్ని సీఎం ప్రతిపాదించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో సీఎం బీరెంద్ర సింగ్ తన బలాన్ని నిరూపించుకుని ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, టీఎంసీ, ఎల్జేపీ, బీజేపీ కూటమికి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.