LK Advani : అద్వానీ హెల్త్ బులిటెన్ విడుదల

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ(LK Advani) ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్(Health Bullitin) విడుదల చేశారు.

Update: 2024-12-17 16:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ(LK Advani) ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్(Health Bullitin) విడుదల చేశారు. అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు, ఒకటీ రెండు రోజుల్లో ఐసీయూ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తీవ్ర అనారోగ్యంతో ఈనెల 12 నుంచి అద్వానీ ఢిల్లీ(Delhi)లోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి(Apollo Hospital)లోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన న్యూరాలజీ డాక్టర్ల సమక్షంలో ఆయన చికిత్స పొందుతున్నారు. క్రమంగా ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతునట్టు, త్వరలోనే అత్యవసర విభాగం నుంచి బయటికి వస్తారని వైద్యులు పేర్కొన్నారు.  

Tags:    

Similar News