అప్పటివరకు ఉత్తమే పీసీసీ ప్రెసిడెంట్ : ఠాగూర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీపీసీసీ చీఫ్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నేతలంతా ఎవరికి వారు ధీమాతో తానే అర్హుడిని అంటూ.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కష్టపడ్డారని అన్నారు. అయినా ఎన్నికల్లో ఓడిపోవడం బాధాకరమైన అంశం అని అభిప్రాయపడ్డారు. ఇకనుంచి ఉమ్మడి […]

Update: 2020-12-09 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీపీసీసీ చీఫ్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నేతలంతా ఎవరికి వారు ధీమాతో తానే అర్హుడిని అంటూ.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కష్టపడ్డారని అన్నారు. అయినా ఎన్నికల్లో ఓడిపోవడం బాధాకరమైన అంశం అని అభిప్రాయపడ్డారు.

ఇకనుంచి ఉమ్మడి నిర్ణయంతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామని తెలిపారు. అంతేగాకుండా కొత్త టీపీసీసీని నియమించే వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు. పీసీసీపై కోర్ కమిటీ సమావేశం ద్వారా వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సమస్యలన్నింటినీ అధిగమించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News