రామ్ చరణ్ ఓటుపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా.. వేడి తగ్గడం లేదు. ప్రకాశ్ రాజ్ ఓడిపోవడంతో ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా రాజీనామా బాట పట్టారు. అయితే, దీనిపై ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. వంద శాతం మోహన్ బాబు వల్లే గెలిచానని విష్ణు స్పష్టం చేశారు. ‘మా’ ఇంటి పెద్దల్లో నాగబాబు ఒకరని, మనసు కష్టం వల్లే ఆయన రాజీనామా […]

Update: 2021-10-11 09:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా.. వేడి తగ్గడం లేదు. ప్రకాశ్ రాజ్ ఓడిపోవడంతో ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా రాజీనామా బాట పట్టారు. అయితే, దీనిపై ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. వంద శాతం మోహన్ బాబు వల్లే గెలిచానని విష్ణు స్పష్టం చేశారు. ‘మా’ ఇంటి పెద్దల్లో నాగబాబు ఒకరని, మనసు కష్టం వల్లే ఆయన రాజీనామా చేశారని విష్ణు తెలిపారు. నాగబాబు, ప్రకాశ్ రాజ్ రాజీనామాలను ఆమోదించనని విష్ణు చెప్పారు. ప్రకాశ్ రాజ్ ‘మా’ అధ్యక్షుడిగా ఉండాలని 260 మంది కోరుకున్నారని వెల్లడించారు. అంతేకాకుండా ‘మా’ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని చిరంజీవి అంకుల్‌ చెప్పారని, రామ్‌చరణ్‌ కూడా నాకు ఓటు వేయలేదని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్టీఆర్‌ ఓటు వేసేందుకు రాలేదన్నారు.

అనంతరం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండవచ్చునని.. కానీ ‘మా’ ఒకటే పార్టీ అన్నారు. నటీనటులకు సాయం చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలను కోరతామని, సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రుల సహకారం ఎంతో అవసరం అన్నారు.

Tags:    

Similar News