కొడుకు మృతి.. ఫోటోతో థియేటర్ కి వెళ్లిన తండ్రి.. ఎందుకంటే?
దిశ, వెబ్ డెస్క్: కన్న బిడ్డల మీద తల్లిదండ్రుల ప్రేమ తెలపడం ఎవరికి సాధ్యం కాదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారి ఏది అడిగినా నిమిషంలో తీసుకొచ్చి ఇస్తారు. అందుకే లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కన్న ఏ ప్రేమ గొప్పది కాదంటారు. అలంటి ప్రేమ పంచే తల్లిదండ్రులకు కన్నకొడుకు దూరమైతే ఆ భాధ వర్ణనాతీతం. ఎదిగొచ్చిన కన్న కొడుకును బైక్ యాక్సిడెంట్ ద్వారా పోగొట్టుకున్న ఒక తండ్రి కొడుకు చివరి కోరికను చనిపోయాక తీర్చాడు. ఈ […]
దిశ, వెబ్ డెస్క్: కన్న బిడ్డల మీద తల్లిదండ్రుల ప్రేమ తెలపడం ఎవరికి సాధ్యం కాదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారి ఏది అడిగినా నిమిషంలో తీసుకొచ్చి ఇస్తారు. అందుకే లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కన్న ఏ ప్రేమ గొప్పది కాదంటారు. అలంటి ప్రేమ పంచే తల్లిదండ్రులకు కన్నకొడుకు దూరమైతే ఆ భాధ వర్ణనాతీతం. ఎదిగొచ్చిన కన్న కొడుకును బైక్ యాక్సిడెంట్ ద్వారా పోగొట్టుకున్న ఒక తండ్రి కొడుకు చివరి కోరికను చనిపోయాక తీర్చాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మైసూర్ లో చోటుచేసుకుంది.
మైసూరు కువెంపు నగరకు చెందిన మురళీధర్ కు ఇద్దరు కుమారులు. ఎంతో అందమైన కుటుంబం. పెద్ద కొడుకు హరికృష్ణన్ కన్నడ హీరో పునీత్ రాజ్ పుత్ కి వీరాభిమాని. అయన ప్రతి సినిమాకు ఫస్ట్ షోకి తండ్రి కొడుకులిద్దరూ వెళ్లేవారు. ఎప్పటిలానే ఏప్రిల్ 1 న విడుదలై ‘యువరత్న’ కు వెళ్లాలని అనుకున్నారు. కానీ విధి ఆ కుటుంబంతో ఆడుకుంది. సినిమా విడుదల కాకముందే హరికృష్ణన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కానీ తండ్రి మాత్రం కొడుకు కోరికను తీర్చాలని కోరుకున్నాడు. కొడుకు ఫొటోతో థియేటర్ కి వెళ్ళాడు. నాలుగు టికెట్లను తీసుకొని ఫ్యామిలీతో కలిసి సినిమా చూశాడు. అక్కడ ఉన్నవారందరూ ఫోటో చూసి ఏంటి? సంగతి అని అడగగా … కొడుకును తలుచుకొని కన్నీటిపర్యంతమయ్యారు. కొడుకు కోరికను నెరవేర్చినందుకు అక్కడ ఉన్నవారందరూ ఆ కుటుంబాన్ని మెచ్చుకున్నారు.