లవ్ స్టోరీ @రైల్వే స్టేషన్
దిశ, వెబ్‌డెస్క్: అది ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ పియర్స్ రైల్వే స్టేషన్.. అప్పుడే ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్న ట్రైన్.. లోకో పైలట్‌గా ఓ యువతి. ట్రైన్ స్లో అవుతుండగా, క్యాబిన్‌లో నుంచి ప్లాట్ ఫామ్ వైపు చూసిన ఆ యువతికి విల్(Will) అనే బోర్డు కనబడింది. అలా ట్రైన్ ముందుకు కదిలే కొద్దీ.. వరుసగా ‘యు(You), ఆ తర్వాత మ్యారీ (Marry), చివరగా (Me)’ అనే పదాలతో కూడిన బోర్డులు కనబడ్డాయి. ఇక ట్రైన్ ఆగేసరికి.. […]
దిశ, వెబ్‌డెస్క్: అది ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ పియర్స్ రైల్వే స్టేషన్.. అప్పుడే ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్న ట్రైన్.. లోకో పైలట్‌గా ఓ యువతి. ట్రైన్ స్లో అవుతుండగా, క్యాబిన్‌లో నుంచి ప్లాట్ ఫామ్ వైపు చూసిన ఆ యువతికి విల్(Will) అనే బోర్డు కనబడింది. అలా ట్రైన్ ముందుకు కదిలే కొద్దీ.. వరుసగా ‘యు(You), ఆ తర్వాత మ్యారీ (Marry), చివరగా (Me)’ అనే పదాలతో కూడిన బోర్డులు కనబడ్డాయి. ఇక ట్రైన్ ఆగేసరికి.. అక్కడ ఓ యువకుడు పూల బొకే పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆమె ట్రైన్ దిగి నడుచుకుంటూ రాగానే మెకాళ్ల మీద నిలబడి ‘విల్ యు మ్యారీ మీ(Will you Marry Me)’ అని అడిగాడు. వెంటనే ఆ ప్రపోజల్‌కు ఓకే చెప్పి యువతి అతడిని ముద్దాడింది. ఇదంతా సినిమా స్టోరీ కాదు రియల్ స్టోరీయే..
ఐర్లాండ్‌కు చెందిన ఓసులివన్ అనే యువకుడు.. లోకో పైలట్ అయిన తన గర్ల్ ఫ్రెండ్ పౌల కార్బో జియాను జీవిత భాగస్వామిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు వినూత్నంగా తెలపాలని భావించిన ఆ యువకుడు.. పియర్స్ రైల్వేస్టేషన్‌ను వేదికగా ఎంచుకున్నాడు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లతో మాట్లాడి, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించాడు. ఆమె ట్రైన్ నడుపుకుంటూ వచ్చే సమయానికి బోర్డులు డిస్‌ప్లే అయ్యేలా చేసి వినూత్నంగా ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా వెంటనే యాక్సెప్ట్ చేయడంతో ఈ లవ్ స్టోరీ సక్సెస్ అయింది. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా రైల్వే ఆఫీసర్లు పోస్ట్ చేయగా అది వైరలవుతోంది.
https://twitter.com/IrishRail/status/1339157299437428743?s=20