అత్త సహాయంతో మామను చంపిన అల్లుడు
దిశ, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు డిపి గంగారం హత్య కేసును ఐదు రోజుల్లోనే పోలీసులు చేధించారు. గంగారాంను ఆస్తి కోసం భార్య, అల్లుడే హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. గత ఆదివారం డిపి గంగారం పంట పొలానికి నీరు పెట్టేందుకు రాత్రి వెళ్లడంతో అప్పటికే అక్కడ […]
దిశ, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు డిపి గంగారం హత్య కేసును ఐదు రోజుల్లోనే పోలీసులు చేధించారు. గంగారాంను ఆస్తి కోసం భార్య, అల్లుడే హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు.
గత ఆదివారం డిపి గంగారం పంట పొలానికి నీరు పెట్టేందుకు రాత్రి వెళ్లడంతో అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న భార్య రమలక్ష్మీ, అల్లుడు గడుగు రాజు అలియాస్ దామ శ్రీకాంత్ అతని స్నేహితులు సీతపట్ల గణేష్, ఆసది శేఖర్ బండరాళ్లతో మోది హత్య చేశారు. డిపి గంగారం కూతురు శృతికి గత తొమ్మిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన గడుగు రాజుతో కులాంతర వివాహం జరిగింది.
ఈ వివాహానికి గంగారం అభ్యంతరం చెప్పినా జరిగింది. గంగారంకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని కాస్త అల్లుడు పేరు మీద చేయాలని గంగారంపై ఒత్తిడి చేశారు. అయితే అందుకు గంగారారం అంగీకరించలేదు. గంగారం ఉంటే తనను ఇంటి అల్లుడుగా అంగీకరించడని, తనకు ఆస్తి రాదని భావించిన అల్లుడు.. మామను చంపాలని అత్త సహయంతో కుట్ర పన్నిమామను హత్య చేశాడు అని పోలీసులు వెల్లడించారు.