కరోనా శవాలను కూడా పీక్కుతింటున్న యువకుడు.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: 2020 ఎన్నో దారుణాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఏడాదిలోనే కరోనా వైరస్ దేశానికి అంటుకుంది. ఇక 2021 లోనైనా ప్రశాంతంగా ఉందామనుకున్న ప్రజలను కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఇంకా నరకంగా మార్చింది. కరోనా మృతుల చితులతో మంటలారని స్మశానాలు, ఆక్సిజన్ లేక ప్రాణాలు వదులుతున్న ప్రజలు, సొంత మనుషులను సైతం నడిరోడ్డున వదిలేస్తున్న బంధువులు ఇలాంటి దారుణాలు ఎన్నో ఈ ఏడాది లో చూస్తున్నాం. ఇక ఇవన్నీ కాకుండా మరో దారుణమైన […]
దిశ, వెబ్ డెస్క్: 2020 ఎన్నో దారుణాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఏడాదిలోనే కరోనా వైరస్ దేశానికి అంటుకుంది. ఇక 2021 లోనైనా ప్రశాంతంగా ఉందామనుకున్న ప్రజలను కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఇంకా నరకంగా మార్చింది. కరోనా మృతుల చితులతో మంటలారని స్మశానాలు, ఆక్సిజన్ లేక ప్రాణాలు వదులుతున్న ప్రజలు, సొంత మనుషులను సైతం నడిరోడ్డున వదిలేస్తున్న బంధువులు ఇలాంటి దారుణాలు ఎన్నో ఈ ఏడాది లో చూస్తున్నాం. ఇక ఇవన్నీ కాకుండా మరో దారుణమైన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఒక వ్యక్తి స్మశానంలో కరోనా రోగుల సగం కాలిన శవాలను పీక్కుతింటూ కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయంతో గజగజ వణికిపోయారు.
సతారా జిల్లాలోని కోలకి గ్రాయ పంచాయతీ స్మశాన వాటికలో బుధవారం ఒక యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులకు కనిపించాడు. ఒక్కడే మాస్క్ లేకుండా కనిపించడంతో అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అందరు చూస్తూ ఉన్నారు. ఇంతలోనే అక్కడ కరోనాతో మృతిచెందిన ఒక శవాన్ని మంటల్లో నుండి లాగి శవాన్ని తినడం స్టార్ట్ చేశాడు. ఒక్క క్షణం అవాక్కయిన స్థానికులు తాము చూస్తున్నది నిజమేనా అంటూ కళ్ళు నులుముకుని చూశారు. దీంతో భయపడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ యువకుడిని పట్టుకోవడానికి స్మశానానికి వెళ్లగా అతను అక్కడి నుండి పరారయ్యాడు.
యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు సాయంత్రానికి అతనిని పట్టుకొని విచారించారు. యువకుడికి మతిస్థిమితం లేదని, కొద్దికొద్దిగా హిందీ మాట్లాడుతున్నాడని పోలీసులు తెలిపారు. పేరు, ఊరు లాంటి వివరాలు ఏమి చెప్పలేకపోతున్నాడని, పరీక్షల నిమిత్తం అతనిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు.