ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అఫ్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. ఉస్మానియా ఆసుపత్రిలోని కూలికుతుబ్ షా భవనం రెండవ అంతస్తులో ఉన్న వార్డులో శ్లాబుకు ఉన్న కొక్కానికి టవల్‌తో ఉరేసుకుని మృతి చెందిన వ్యక్తిని బుధవారం తెల్లవారు జామున సిబ్బంది గమనించి ఆస్పత్రి అధికారులతో పాటు అఫ్జల్ గంజ్ పోలీసులకు సమాచారం […]

Update: 2021-06-16 06:26 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అఫ్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. ఉస్మానియా ఆసుపత్రిలోని కూలికుతుబ్ షా భవనం రెండవ అంతస్తులో ఉన్న వార్డులో శ్లాబుకు ఉన్న కొక్కానికి టవల్‌తో ఉరేసుకుని మృతి చెందిన వ్యక్తిని బుధవారం తెల్లవారు జామున సిబ్బంది గమనించి ఆస్పత్రి అధికారులతో పాటు అఫ్జల్ గంజ్ పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతుని గురించి ఆరా తీయగా.. ఎటువంటి సమాచారం లభించలేదు. రోగులు కూడా అతనిని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హాస్సిటల్ మెయిన్ గేట్ వద్ద ఉన్న రెండు సీసీ కెమెరాలను పరిశీలించగా.. అందులో ఒకటి పని చేయడం లేదు. రెండవ దానిలో మృతుని ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News