ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులకు ముఖ్య గమనిక

దిశ, మల్యాల : ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, బోర్డు ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్, ప్యాకెట్ శానిటైజర్ వెంట తీసుకురావాలని మల్యాల గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శివ రామకృష్ణ తెలిపారు. ఈనెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, అరగంట ముందే (8.30am) సెంటర్‌లోనికి విద్యార్థులను అనుమతిస్తామని, అవసరమైతే వాటర్ బాటిల్ వెంట తీసుకోవచ్చునని తెలిపారు. మొత్తంగా 189 […]

Update: 2021-10-23 05:45 GMT

దిశ, మల్యాల : ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, బోర్డు ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్, ప్యాకెట్ శానిటైజర్ వెంట తీసుకురావాలని మల్యాల గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శివ రామకృష్ణ తెలిపారు. ఈనెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, అరగంట ముందే (8.30am) సెంటర్‌లోనికి విద్యార్థులను అనుమతిస్తామని, అవసరమైతే వాటర్ బాటిల్ వెంట తీసుకోవచ్చునని తెలిపారు.

మొత్తంగా 189 మంది విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, సెంటర్‌లో ఒక ఐసోలేషన్ రూమ్‌తో పాటుగా ఒక ANM నర్సును కూడా అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు సైకాలజిస్టుల నెంబర్లను అందుబాటులో ఉంచిందన్నారు. అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు లేకుండా పిల్లలను పరీక్షలకు హాజరు అయ్యేలా సన్నద్ధం చేయాలని చెప్పారు.

Tags:    

Similar News