రోడ్డెక్కిన మంత్రి మల్లారెడ్డి.. బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, మేడ్చల్ టౌన్: భారతీయ జనతా పార్టీ ఓ ఝూటా పార్టీ అంటూ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతుల […]
దిశ, మేడ్చల్ టౌన్: భారతీయ జనతా పార్టీ ఓ ఝూటా పార్టీ అంటూ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. రైతుల అభివృద్ధిని నిరోధించిన పార్టీలు నామరూపాలు లేకుండా పోయాయన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.