విజయనగరంలో డెంగ్యూ పరీక్షల ల్యాబ్!
దిశ, విశాఖపట్నం : డెంగ్యూ పరీక్షలు నిర్వహించేందుకువిజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో త్వరలో ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు విశాఖ జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.ఎస్. ప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా ఆస్పత్రిని సందర్శించి, ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో మలేరియా నిర్ధారణ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? అవసరమైన అన్ని పరికరాలు వున్నాయా? లేవా? అనే విషయాలపై సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఇకపై డెంగ్యూకు సంబంధించిన పరీక్షలు జిల్లా ఆస్పత్రిలో పకడ్బందీగా నిర్వహించేందుకు వైద్యసిబ్బందికి […]
దిశ, విశాఖపట్నం : డెంగ్యూ పరీక్షలు నిర్వహించేందుకువిజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో త్వరలో ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు విశాఖ జోనల్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.ఎస్. ప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా ఆస్పత్రిని సందర్శించి, ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు.
ఆస్పత్రిలో మలేరియా నిర్ధారణ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? అవసరమైన అన్ని పరికరాలు వున్నాయా? లేవా? అనే విషయాలపై సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఇకపై డెంగ్యూకు సంబంధించిన పరీక్షలు జిల్లా ఆస్పత్రిలో పకడ్బందీగా నిర్వహించేందుకు వైద్యసిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. దశలవారీగా పార్వతీపురం, సాలూరు, ఎస్.కోట, చీపురుపల్లి ఆస్పత్రులలో కూడా డెంగ్యూ పరీక్షలు ప్రారంభిస్తారని చెప్పారు.