ఎండిన ఆకుల్లో జీవి.. ఎన్ని ప్రత్యేకతలో!
దిశ, ఫీచర్స్ : ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ అనేది నేటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన మాట. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనగలగాలన్నా, మనుగడ సాగించాలన్నా యూనిక్ టాలెంట్ లేదా ఫీచర్స్ కలిగి ఉండాలి. అందుకు సాధనతో పాటు నిరంతర శ్రమ అవసరం. లేదంటే కాంపిటీటర్స్ మన ఎగ్జిస్టెన్స్‌ను ప్రశ్నార్థకంగా మార్చేస్తారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. మానవులతో పాటు జంతువుల మనుగడ కూడా ప్రస్తుతం అయోమయంలో ఉంది. ఈ క్రమంలో తమను తాము […]
దిశ, ఫీచర్స్ : ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ అనేది నేటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన మాట. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనగలగాలన్నా, మనుగడ సాగించాలన్నా యూనిక్ టాలెంట్ లేదా ఫీచర్స్ కలిగి ఉండాలి. అందుకు సాధనతో పాటు నిరంతర శ్రమ అవసరం. లేదంటే కాంపిటీటర్స్ మన ఎగ్జిస్టెన్స్‌ను ప్రశ్నార్థకంగా మార్చేస్తారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. మానవులతో పాటు జంతువుల మనుగడ కూడా ప్రస్తుతం అయోమయంలో ఉంది. ఈ క్రమంలో తమను తాము రక్షించుకునేందుకు, జీవనం సాగించేందుకు పలు జంతువులు, క్షీరదాలు, కీటకాలు కూడా కొన్ని యూనిక్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. అలాంటి ఓ యూనిక్ ఫ్రాగ్ గురించి తెలుసుకుందాం.
ఉభయచర జీవి ‘కప్ప’ నీటిలోనే కాదు భూమ్మీద కూడా జీవిస్తుంది. ఆహారవేటలో భాగంగా ఇది రెండు చోట్లా మనగలుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కప్ప మాత్రం చాలా ప్రత్యేకమైంది. థాయిలాండ్, సింగపూర్, బొర్నియో దీవుల్లో ఉండే ఈ ‘మలేషియన్ హార్న్డ్ లీఫ్ ఫ్రాగ్’లు చూసేందుకు అచ్చం ఆకుల్లానే ఉంటాయి. ఇవి అడవుల్లోని ఎండిన ఆకుల్లో జీవిస్తూ, అక్కడ తిరిగే పురుగులను తింటుంటాయి. ఇక ఇతర జీవులకు తమ ఉనికి తెలియకుండా ఉండేలా.. వీటి చర్మం, రూపం అక్కడుండే ఆకుల్లో కలిసిపోయినట్లుగానే ఉండటం విశేషం. అచ్చం ఎండిన ఆకుల్లానే కనిపించే ఈ జీవులను మనం గుర్తించలేం కూడా. కాగా ఈ కప్పకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. దీని యూనిక్ ఫీచర్స్ తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.