కరోనా వారియర్స్‌కు మలైకా థ్యాంక్స్..

బాలీవుడ్ ఫిట్ బ్యూటీ మలైకా అరోరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో తన డైలీ ప్రోగ్రామ్ షేర్ చేసిన మలైకా.. రీసెంట్‌గా ‘14 డేస్ 14 ఆసన్’ పేరుతో యోగా ప్రాముఖ్యత, ఆసనాల వల్ల కలిగే లాభాల గురించి వివరించింది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది యోగా బ్యూటీ. కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ బిల్డింగ్‌ను శానిటైజ్ చేసి.. […]

Update: 2020-06-23 07:45 GMT

బాలీవుడ్ ఫిట్ బ్యూటీ మలైకా అరోరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో తన డైలీ ప్రోగ్రామ్ షేర్ చేసిన మలైకా.. రీసెంట్‌గా ‘14 డేస్ 14 ఆసన్’ పేరుతో యోగా ప్రాముఖ్యత, ఆసనాల వల్ల కలిగే లాభాల గురించి వివరించింది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది యోగా బ్యూటీ. కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ బిల్డింగ్‌ను శానిటైజ్ చేసి.. సురక్షితంగా ఉంచుతున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. పీపీఈ కిట్స్‌లో ఉన్న అధికారులు శానిటైజ్ చేయగా.. ‘మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న కరోనా వారియర్స్‌కు థాంక్స్’ అంటూ స్టేటస్ పెట్టింది మలైకా.

ఇక తన ఫిట్‌నెస్‌తో హీరోయిన్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటున్న మలైకా.. ‘సర్వ యోగా, దివా యోగా’ కో ఫౌండర్ కూడా. అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని బాలీవుడ్ టాక్.

Tags:    

Similar News