కరోనా మృతుల్లో అత్యధికులు పురుషులే..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ 534 మందికి సోకింది. వీరిలో 2.26 శాతం మంది అంటే 14 మంది మృత్యువాత పడ్డారు. వారిలో 13 మంది పురుషులు కావడం విశేషం. వారిలో కూడా 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులు 8 మంది మృత్యువాతపడడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు, వయసు పైబడుతున్న వారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏపీలో కరోనా సోకిన వారిలో మృతి చెందిన వారికి అదిక రక్త పోటు, అస్తమ, […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ 534 మందికి సోకింది. వీరిలో 2.26 శాతం మంది అంటే 14 మంది మృత్యువాత పడ్డారు. వారిలో 13 మంది పురుషులు కావడం విశేషం. వారిలో కూడా 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులు 8 మంది మృత్యువాతపడడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు, వయసు పైబడుతున్న వారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో కరోనా సోకిన వారిలో మృతి చెందిన వారికి అదిక రక్త పోటు, అస్తమ, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడంతో వారి పట్ల కరోనా తీవ్రంగా పని చేసిందని తెలిపారు. ఈ రకమైన సమస్యలు ఉన్నవారు నలుగురూ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలై మృత్యుఒడికి చేరారని వైద్యులు వెల్లడించారు.
ఏపీలో కరోనా బారిన పడి 14 మంది మృతి చెందితే అందులో 8 మందికి కృష్ణా, గుంటూరు వాసులేనని నివేదికలు చెబుతున్నాయి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు. మృతులంతా ఢిల్లీ బాధితులతో సంబంధాలు నెరపినవారేనని తెలుస్తోంది. దీంతో కరోనా రెండో దశలోనే తీవ్ర ప్రభావం చూపిందని, మూడో దశకు వ్యాపించకుండా చర్యలు చేపట్టడం ఫలితాన్నిచ్చిందని వైద్యులు చెబుతున్నారు.
Tags: coronavirus, covid-19, andhra pradesh, health department