యుద్ధ ప్రభావం.. ఇజ్రాయిల్‌లో ఎమర్జెన్సీ..!

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, వైమానిక దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధిస్తూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని వారాలుగా పాలస్తీనా పౌరులు-ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య నెలకొన్న ఘర్షణలు ఏకంగా ఉగ్రదాడులకు దారి తీయండంతో ఆయన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ముఖ్యంగా ‘లాడ్‌’ సిటీని లక్ష్యంగా చేసుకొని మూడు ప్రార్థన మందిరాలు, అనేక దుకాణాలకు నిప్పంటించినట్టు నివేదికలు రావడంతో.. ఉన్నతాధికారులు, న్యాయ అధికారులతో సమావేశం నిర్వహించిన ప్రధాన […]

Update: 2021-05-11 21:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, వైమానిక దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధిస్తూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని వారాలుగా పాలస్తీనా పౌరులు-ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య నెలకొన్న ఘర్షణలు ఏకంగా ఉగ్రదాడులకు దారి తీయండంతో ఆయన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ముఖ్యంగా ‘లాడ్‌’ సిటీని లక్ష్యంగా చేసుకొని మూడు ప్రార్థన మందిరాలు, అనేక దుకాణాలకు నిప్పంటించినట్టు నివేదికలు రావడంతో.. ఉన్నతాధికారులు, న్యాయ అధికారులతో సమావేశం నిర్వహించిన ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలతో..

సోమవారం అల్‌-అక్సా మసీదులో ఇజ్రాయిల్ పోలీసులు-పాలస్తీనా పౌరులకు మధ్య జరిగిన రాళ్లదాడి, ప్రతిచర్యగా ఇజ్రాయిల్ చేసిన దాడిలో మొత్తం 20 మంది చనిపోయారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు. స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. దీంతో గజా నుంచి ఇజ్రాయిల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు. ఇందుకు బదులిస్తూ ఇజ్రాయిల్‌ కూడా వైమానిక దాడులు చేసింది.

ది జెరుసలేం పోస్ట్ ప్రచురణ..

జెరుసలేంలో జరిగిన ఘర్షణలో మొత్తం 30 మంది మరణించారని, ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారని… మరో 150 మందికి తీవ్రగాయాలు గాయాలు అయినట్టు ‘ది జెరుసలేం పోస్ట్’ ప్రచురించింది. ఇజ్రాయిల్‌‌ ఉగ్రదాడిలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. అందులో ఒకరు భారత్‌(కేరళ)కు చెందినవారు. ఉగ్రదాడులపై ఎదురుదాడి చేసిన ఇజ్రాయిల్ గాజా నగరంపై విరుచుకుపడింది. వైమానిక దాడులతో బీభత్సం సృష్టించింది. ఈ దాడిలో 16 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రకటించగా.. ఇజ్రాయిల్ దళాలు గాజాలోని ఓ అపార్ట్‌మెంట్‌పై చేసిన దాడిలో ముగ్గురు మాత్రమే చనిపోయారని హమాస్ ఉగ్రవాద ముఠా స్పష్టం చేసింది. ఇందుకు గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించింది.

ఇటువంటి పరిణామాలకు తోడుగా రోజు‌ రోజుకి యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాగా, 1966 తర్వాత తొలిసారిగా ఒక అరబ్ కంట్రీ ఎమర్జెన్సీ విధించడం ఇదే తొలిసారి.

వైమానిక దాడులకు సంబంధించిన వీడియో..

Tags:    

Similar News