‘రౌడీయిజంతో రాజకీయం చేస్తున్న మైనపల్లిని అరెస్ట్ చేయాలి’

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ లు పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి నీచమైన వ్యక్తి అని, గూండాయిజం దాడులతో రాజకీయం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ లో చేరదామని […]

Update: 2021-08-15 02:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ లు పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి నీచమైన వ్యక్తి అని, గూండాయిజం దాడులతో రాజకీయం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ లో చేరదామని వస్తే మేం తరిమికొట్టామని, అలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. మైనంపల్లి అక్రమాలను బయటపెట్టి రౌడీయిజాన్ని తొక్కిపడేస్తామని హెచ్చరించారు.

దాడి జరుగుతున్న సమయంలో చోద్యం చూస్తున్న పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీజీపీ స్పందించి మైనంపల్లి సహా టీఆర్ఎస్ గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామన్నారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కలిపించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు విచక్షణ రహితంగా బూతులు తిడుతూ తన పై దాడి చేసారని చెప్పారు. నిందితులని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News