కాంగ్రెస్‌లో ఫుల్ జోష్.. ‘కారు’ దిగుతున్న కీలక నేతలు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు టీఆర్ఎస్ నాయకులు కారు దిగుతున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పోవటం.. కీలక పదవుల్లో ఉన్న వారితో మాటలు పడలేక.. పార్టీలో రాజీ పడి ఉండలేక.. రాజీనామా బాట పడుతున్నారు. గులాబీ పార్టీలో ముళ్లు గుచ్చుకుంటున్నాయి.. క్షేత్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యేలతో ద్వితీయ శ్రేణి నాయకులకు పడటం లేదు. దీంతో ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడగా.. తాజాగా అధికార పార్టీ […]

Update: 2021-08-29 03:14 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు టీఆర్ఎస్ నాయకులు కారు దిగుతున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పోవటం.. కీలక పదవుల్లో ఉన్న వారితో మాటలు పడలేక.. పార్టీలో రాజీ పడి ఉండలేక.. రాజీనామా బాట పడుతున్నారు. గులాబీ పార్టీలో ముళ్లు గుచ్చుకుంటున్నాయి.. క్షేత్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యేలతో ద్వితీయ శ్రేణి నాయకులకు పడటం లేదు. దీంతో ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడగా.. తాజాగా అధికార పార్టీ సర్పంచ్‌లు కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి గత ఏడేళ్లుగా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2014 నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామ పక్షాల నుంచి తాజా మాజీలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కారెక్కారు. 3

రెండో సారి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి మరింత వలసలు పెరిగాయి. 2014లో కాంగ్రెస్ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు గెలువగా.. ఆ ముగ్గురు కూడా టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కారు. దీంతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో విపక్షాలు ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాజాగా ఏడేళ్ల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. గతంలో అంతా టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు, నామినేట్ పోస్టులను అనుభవించిన వారు, నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.

ఇటీవల ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్యకు స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో పొసగక పార్టీకి రాజీనామా చేయటంతో పాటు ఏఎంసీ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బెజ్జూర్ పీఏసీఎస్ చైర్మన్ అర్షద్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రధాన అనుచరుడు కాగా.. ఆయనతో విబేధాలు రావటంతో పార్టీని వీడి బీఎస్పీలో చేరారు.

మరోవైపు గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయిలో నిధులు రావడం లేదని, చేసిన పనులకు బిల్లులు ఇవ్వటం లేదని, కొత్త చట్టంలో లేని అంశాలను కూడా బలవంతంగా అమలు చేస్తున్నారని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే వాంకిడి మండలంలోని 24మంది సర్పంచ్‌లు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవ లక్ష్మీకి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు వెళ్లటం సహజం. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లడం గమనార్హం. అదీ నామినేట్, ఇతర పదవుల్లో ఉన్నవారు కారు దిగటం కొసమెరుపు.

Tags:    

Similar News