కెరీర్‌లో తొలిసారి హాఫ్ సెంచరీ కొట్టిన బుమ్రా
దిశ, స్పోర్ట్స్ : యార్కర్లతో ప్రత్యర్ది జట్టు బ్యాట్స్‌మాన్ బెంబేలెత్తించే జస్ప్రిత్ బుమ్రా ఈ సారి బ్యాటుతో చెలరేగిపోయాడు. తన కెరీర్‌లో తొలి ఫస్ట్‌క్లాస్ అర్దసెంచరీని నమోదు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియా ‘ఏ’ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ‘ఏ’ బ్యాట్స్‌మాన్ పూర్తిగా విఫలమయ్యారు. శుభమన్ గిల్ (43), పృథ్వీ షా (40) తప్ప ఎవరూ రాణించలేదు. ఒకానొక సమయంలో ఇండియా జట్టు 100 పరుగుల లోపే చాపచుట్టేస్తుందని భావించారు. కానీ, టెయిలెండర్లు జస్ప్రిత్ బుమ్రా (55 […]
దిశ, స్పోర్ట్స్ : యార్కర్లతో ప్రత్యర్ది జట్టు బ్యాట్స్‌మాన్ బెంబేలెత్తించే జస్ప్రిత్ బుమ్రా ఈ సారి బ్యాటుతో చెలరేగిపోయాడు. తన కెరీర్‌లో తొలి ఫస్ట్‌క్లాస్ అర్దసెంచరీని నమోదు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియా ‘ఏ’ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ‘ఏ’ బ్యాట్స్‌మాన్ పూర్తిగా విఫలమయ్యారు. శుభమన్ గిల్ (43), పృథ్వీ షా (40) తప్ప ఎవరూ రాణించలేదు. ఒకానొక సమయంలో ఇండియా జట్టు 100 పరుగుల లోపే చాపచుట్టేస్తుందని భావించారు. కానీ, టెయిలెండర్లు జస్ప్రిత్ బుమ్రా (55 నాటౌట్), సిరాజ్ (22) ఆదుకున్నారు. బుమ్రా కేవలం 57 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలు, 2 సిక్సులు ఉన్నాయి. బుమ్రా కెరీర్‌లో ఏ ఫార్మాట్‌లో అయినా ఇదే తొలి అర్ద సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్‌లో ప్రదర్శన ద్వారా నేరుగా టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్న బుమ్రా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడింది చాలా తక్కువ. తొలి టెస్టు ముందు సిడ్నీలో జరుగుతున్న మూడు రోజుల డే/నైట్ మ్యాచ్ తొలి రోజు జట్టు మొత్తం విఫలమైనా.. బుమ్రా తన బ్యాటుతో ఆదుకోవడం విశేషం. తొలి రోజు 48.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 194 పరుగులకే ఇండియా ‘ఏ’ ఆలౌట్ అయ్యింది.