సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ బాబు.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఈ ఏడాది జూలై 31న చేసిన ట్వీట్‌కు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ ఇండియా 2021 సంవత్సరానికి గానూ  ఎంటర్టైన్మెంట్ టాప్ ఇండియన్ ట్వీట్స్‌ను తాజాగా వెల్లడించింది. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మహేష్ పెట్టిన పోస్ట్ ఈ ఏడాది అత్యధికంగా కోట్ చేయబడిన ట్వీట్‌గా నిలవడం విశేషం. ఇక ప్రిన్స్ […]

Update: 2021-12-10 01:37 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఈ ఏడాది జూలై 31న చేసిన ట్వీట్‌కు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ ఇండియా 2021 సంవత్సరానికి గానూ ఎంటర్టైన్మెంట్ టాప్ ఇండియన్ ట్వీట్స్‌ను తాజాగా వెల్లడించింది. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మహేష్ పెట్టిన పోస్ట్ ఈ ఏడాది అత్యధికంగా కోట్ చేయబడిన ట్వీట్‌గా నిలవడం విశేషం. ఇక ప్రిన్స్ సినిమా గురించి చేసిన ట్వీట్‌లో.. ‘ఈ సరికొత్త యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జర్నీని ప్రారంభిస్తున్నాను. ఈ సంక్రాంతికి మీరు మాతో చేరండి #SVPFirstNotice’ అని పేర్కొంటూ దీనికి చిత్ర బృందాన్ని ట్యాగ్ చేశారు. మహేష్ చేసిన ఈ ట్వీట్‌ను కోట్ చేస్తూ సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో పోస్టులు పెట్టడంతో 2021లో మోస్ట్ కోటెడ్ ట్వీట్‌గా నిలిచింది. ఇక సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13 న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News