ఆ ఎంపీ రాజీనామా వెనక కారణం అదేనా..?

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. పర్భని లోక్ సభ నియోజకవర్గ ఎంపీ సంజయ్ హెచ్‌ జాదవ్ బుధవారం పార్టీకి, పదవికి రిజైన్ చేయడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఎన్నో పరిణామాల అనంతరం కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఆపార్టీకి చెందిన కీలక ఎంపీ ఇప్పుడు రాజీనామా చేయడం చర్చ నీయాశం అయ్యింది. తన నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా లేఖను […]

Update: 2020-08-31 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. పర్భని లోక్ సభ నియోజకవర్గ ఎంపీ సంజయ్ హెచ్‌ జాదవ్ బుధవారం పార్టీకి, పదవికి రిజైన్ చేయడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఎన్నో పరిణామాల అనంతరం కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఆపార్టీకి చెందిన కీలక ఎంపీ ఇప్పుడు రాజీనామా చేయడం చర్చ నీయాశం అయ్యింది. తన నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా లేఖను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రేకు పంపి.. పలు అంశాలను ప్రస్తావించారు.

పర్బని నియోజకవర్గంలో శివసేన నిర్లక్ష్యం అవుతున్నందున పార్టీ, పదవిలో కొనసాగడంలో అర్థం లేదని, అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎంపీ సంజయ్ హెచ్ జాదవ్ లేఖలో వెల్లడించారు. జింటూరు వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలో ప్రభుత్వేతర అడ్మినిస్ట్రేటర్ బోర్డును నియమించాలని నేను 10 నెలలుగా అడుగతుంటే.. ఒక్క ఎమ్మెల్యే లేనప్పటికీ బోర్డులో ఎన్సీపీ సభ్యులను ఎన్నుకోవడం బాధాకరంగా ఉందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ రాజీనామా… రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఎంపీ రాజీనామాలో బీజేపీ పాత్ర !

పర్బని నియోజకవర్గానికి చెందిన ఎంపీ రాజీనామా వెనకాలో బీజేపీ పాత్ర ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. తమతో కలిసిరాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందనే కోపంతోనే శివసేనను కాషాయం పార్టీ చీల్చేందుకు కుట్ర చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రమంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతలందరూ శివసేన ప్రభుత్వంపై బురద చల్లేందుకే ప్రయత్నిస్తున్నారని, కరోనా కాలంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌‌లో కాంగ్రెస్‌ను చీల్చి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. రాజస్థాన్‌లో చివరి వరకు ప్రయత్నించి వెనుకడుగు వేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రపై లుక్కేసి రాజకీయ చదరంగం ఆడుతుందన్న కామెంట్లు రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినపడుతున్నాయి.

Tags:    

Similar News