బ్లాక్ ఫంగస్ టెన్షన్.. భారీగా పెరుగుతున్న కేసులు
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం అక్కడి మహా సర్కార్‌ను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరగడంతో వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న […]
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం అక్కడి మహా సర్కార్‌ను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరగడంతో వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు.
దీంతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చుతో కూడుకున్నదని.. అయితే వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తోపే అన్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.