వర్క్‌అవుట్ కాదనుకున్నా.. రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి : సింగర్

దిశ, సినిమా : యంగ్ టాలెంటెడ్ సింగర్ అండ్ కంపోజర్ మాధవ్ మహాజన్.. ఎంబీబీఎస్ చేసినా సరే, సింగర్‌ కావాలన్న తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకునేందుకే ఇంట్రెస్ట్ చూపినట్లు తెలిపాడు. పేరెంట్స్ ఇద్దరు డాక్టర్లయినా తనను మాత్రం అదే ప్రొఫెషన్ ఎంచుకోవాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని, నచ్చిన కెరియర్‌లో సెటిలయ్యే ఫ్రీడమ్ ఇచ్చారని వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని.. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్‌లో పాటలు పాడుతూ ఉండేవాడినని చెప్పాడు. ఈ క్రమంలో తను […]

Update: 2021-09-15 06:40 GMT

దిశ, సినిమా : యంగ్ టాలెంటెడ్ సింగర్ అండ్ కంపోజర్ మాధవ్ మహాజన్.. ఎంబీబీఎస్ చేసినా సరే, సింగర్‌ కావాలన్న తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకునేందుకే ఇంట్రెస్ట్ చూపినట్లు తెలిపాడు. పేరెంట్స్ ఇద్దరు డాక్టర్లయినా తనను మాత్రం అదే ప్రొఫెషన్ ఎంచుకోవాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని, నచ్చిన కెరియర్‌లో సెటిలయ్యే ఫ్రీడమ్ ఇచ్చారని వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని.. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్‌లో పాటలు పాడుతూ ఉండేవాడినని చెప్పాడు.

ఈ క్రమంలో తను చేసిన కవర్ సాంగ్స్ వైరల్ కావడంతో బూస్టప్ వచ్చిందని, అప్పుడే మ్యూజిక్‌తో తనకు స్పెషల్ కనెక్షన్ ఉందని అర్థమైందన్నాడు. ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ టైమ్‌లో సింగర్‌గా సెటిల్ అవుతాననే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నాడు. తన ఫస్ట్ రెండు పాటలు ‘బ్లేమ్, హ్యాబిట్’ సూపర్ సక్సెస్ కాగా.. తాను వర్క్‌అవుట్ కాదనుకున్న ‘మన్ బావరియా’ సాంగ్ 17 మిలియన్ వ్యూస్‌తో వండర్స్ క్రియేట్ చేసిందన్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘చన్ వి గవాహ్’ పాట 56 మిలియన్ వ్యూస్ సంపాదించగా.. ప్రస్తుతం ఇదే పాట సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News