WWE స్టార్ ల్యూక్ హార్పర్..ఇకలేరు

దిశ, వెబ్‌డెస్క్‌: 2020 ఇప్పటికే ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగల్చగా..రెజ్లింగ్ అభిమానులను మాత్రం శోకసముద్రంలో ముంచేసింది. ఈ ఏడాది ఎంతో మంది రెజ్లర్లు ప్రాణాలు కోల్పోగా, ఈరోజు(ఆదివారం) ఉదయం వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సూపర్‌ స్టార్‌ జాన్‌ హుబెర్‌ (41) మృతి చెందినట్లు ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది. అభిమానులకు ‘ల్యూక్‌హార్పర్‌’‌గా సుపరిచితమైన హుబెర్ మృతి పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ల్యూక్‌హార్పర్‌కు పెద్ద ఎత్తున అభిమానులుండగా..డబ్ల్యూడబ్ల్యూఈ‌తో పాటు, రెజ్లింగ్ […]

Update: 2020-12-27 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్‌: 2020 ఇప్పటికే ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగల్చగా..రెజ్లింగ్ అభిమానులను మాత్రం శోకసముద్రంలో ముంచేసింది. ఈ ఏడాది ఎంతో మంది రెజ్లర్లు ప్రాణాలు కోల్పోగా, ఈరోజు(ఆదివారం) ఉదయం వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సూపర్‌ స్టార్‌ జాన్‌ హుబెర్‌ (41) మృతి చెందినట్లు ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది. అభిమానులకు ‘ల్యూక్‌హార్పర్‌’‌గా సుపరిచితమైన హుబెర్ మృతి పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ల్యూక్‌హార్పర్‌కు పెద్ద ఎత్తున అభిమానులుండగా..డబ్ల్యూడబ్ల్యూఈ‌తో పాటు, రెజ్లింగ్ సూపర్‌ స్టార్లు హార్పర్‌ మృతికి ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. 1979లో న్యూయార్క్‌లో జన్మించిన హుబెర్‌ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్‌ ప్రోరెజ్లింగ్‌లో ‘బ్రోడై లీ’ పేరుతో రింగ్‌లోకి దిగాడు. ఎంతోమంది బాడీ బిల్డర్లను, రెజ్లింగ్ చాంపియన్లను ప్రపంచానికి పరిచయం చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ, 2012లో హుబెర్‌తో ఒప్పందం చేసుకోగా, ‘ల్యూక్‌హార్పర్‌’ బరిలోకి దిగాడు. హార్పర్‌ 2019 చివర్లో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) నుంచి వైదొలిగి ‘ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌’లో చేరారు.

ఊపిరితిత్తులతో సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన హుబెర్, ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ర్యాండీ ఓర్టన్‌, షేమస్‌, ట్రిపుల్‌ హెచ్‌ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లతో పాటు, హుబెర్ అభిమానులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రెజ్లింగ్ అభిమానులకు తీవ్ర విషాదాన్ని నింపింది. లెజెండరీ రెజ్లర్ లా పర్కా 2, హనా కిమురా, షాద్ గ్యాస్‌పర్ద్, రాకీ జాన్సన్, ప్యాట్ పాటర్సన్, రోడ్ వారియర్ యానిమల్, కమలా వంటి గ్రేట్ ప్రొ రెజ్లర్స్ చనిపోయారు. ఎవరెవరు చనిపోయారంటే..2020 జనవరిలో మెక్సికో మొంటెర్రెలోని ఇన్ రింగ్‌లో స్టంట్ చేస్తుండగా ఇంజ్యురి కావడంతో లా పర్కా ప్యారలైజ్డ్ అయిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరణించాడు. డ్వేన్ ‘ద రాక్’ జాన్సన్స్ ఫాదర్ రాకీ జాన్సన్ (75) కూడా జనవరిలోనే చనిపోయాడు. మే నెలలో జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్ హనా కిమురా(22) ఆత్మహత్య చేసుకుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ స్టార్ షాద్ గ్యాస్‌పర్డ్ (39) మేలోనే మరణించాడు.

ఈ ప్రొ రెజ్లర్ లాస్ ఏంజిల్స్, వెనిస్ పియర్‌ సముద్రంలో స్విమ్ చేయడానికి వెళ్లగా, పెద్ద అల షాద్‌ను ముంచెత్తడంతో చనిపోయాడు. ప్రమాదకర ప్రదేశంలో స్విమ్ చేయకూడదనే సైన్ వార్నింగ్ ఎందుకు పెట్టలేదని, ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని షాద్ భార్య కేసు పెట్టింది. ఏప్రిల్‌లో హోవర్డ్ ఫింకెల్(69), జూన్‌లో డానీ హవోక్ (45), ఆగస్టు‌లో కమల(70), బుల్లెట్ బాబ్ ఆర్మ్ స్ట్రాంగ్ (80), సెప్టెంబర్‌లోరోడ్ వారియర్ యానిమల్ (60), డిసెంబర్‌లో ప్యాట్ పాటర్సన్(79), జ్యూస్(62)తో పాటు ప్రో రెజ్లింగ్ కమ్యూనిటీకి చెందిన పాతిక మందికిపైగా 2020లో చనిపోయారు.

Tags:    

Similar News