లాక్‌డౌన్ సమయంలో ఎల్ అండ్ టీకి భారీ నష్టం!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా రూ. 12,000 కోట్ల విలువైన బిల్లింగ్‌లను కోల్పోయినట్టు వెల్లడించింది. లాక్‌డౌన్ సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చటం కష్టమైనదని మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గుతుందని, ఇప్పటికే ప్రకటించిన కొన్ని ప్రాజెక్టులు కూడా వాయిదా పడే అవకాశముందని, ఇది ఆర్డర్ ఇన్‌ఫ్లోపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని […]

Update: 2020-04-24 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా రూ. 12,000 కోట్ల విలువైన బిల్లింగ్‌లను కోల్పోయినట్టు వెల్లడించింది. లాక్‌డౌన్ సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చటం కష్టమైనదని మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గుతుందని, ఇప్పటికే ప్రకటించిన కొన్ని ప్రాజెక్టులు కూడా వాయిదా పడే అవకాశముందని, ఇది ఆర్డర్ ఇన్‌ఫ్లోపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన వివరించారు.

ప్రస్తుతం ఎల్ అండ్ టీకి రూ. 3.1 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్‌లాగ్ ఉందని, ఈ ప్రాజెక్టులలో కొన్ని మొదటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ..దశల వారీగా నిర్మాణ ప్రదేశాలలో పనులను తిరిగి ప్రారంభిస్తామని సీఈవో చెప్పారు. సంపూర్ణ పరిశుభ్రత, సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత రక్షణ పరికరాలతో ప్రాజెక్టు పనులను చేపడతామని తెలిపారు. అయితే, నివారణ చర్యల వల్ల ప్రాజెక్టు పనుల వేగం, స్థాయిని ప్రభావితం చేస్తుందని, శ్రమశక్తిలో చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్లాలని భావించడం మూలంగా పనులలో వేగం తగ్గుతుందని స్పష్టం చేశారు.

అలాగే, ముడిచమురు ధరల పతనం కారణంగా మధ్యప్రాచ్యంలో ప్రాజెక్టులు ఆలస్యమవడం, వాయిదా పడటం జరుగుతాయని సీఈవో సుబ్రహ్మణ్యన్ అంచనావేస్తున్నారు. చమురు ఉత్పత్తి దేశాలకు ఎగుమతి ఆదాయంలో క్షీణత వల్ల దేశీయ ప్రాజెక్టుల్లో ఖర్చు చేసే సామర్థ్యం దెబ్బతింటుందన్నారు. ఇండియా తర్వాత ఎల్ అండ్ టీకి అతిపెద్ద మార్కెట్ మిడిల్ ఈస్ట్ ప్రాంతమని ఆయన చెప్పారు. సంస్థ తమ ప్రధాన మార్కెట్లలో ఆలస్యమవడం, వాయిదా పడటం వల్ల ఆఫ్రికా వంటి మార్కెట్లో ప్రభావం ఉంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో పని ప్రదేశాల్లో, కర్మాగారాల్లోనే కాంట్రాక్టు కార్మికులకూ, మిగిలిన సిబ్బందికి ఆశ్రయం కల్పిస్తున్నామని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. నిర్మాణం జరుగుతున్న ప్రదేశాలలో లేబర్ కాలనీల కోసం సంస్థ ఇప్పటికే రూ. 500-550 కోట్లను ఖర్చు చేసింది. లాక్‌డౌన్ సమయంలో భద్రతా చర్యల కోసం రూ. 1600-1800 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సంస్థలో అందించే రివార్డులు, ఉద్యోగులకిచ్చే ఇంక్రిమెంట్‌లను వాయిదా వేస్తున్నామని సీఈవో చెప్పారు.

Tags: Larsen and Toubro, L&T, lockdown, coronavirus, covid-19

Tags:    

Similar News