32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన లోయర్ మానేరు డ్యామ్..
దిశ, మానకొండూరు : కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టు 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరద నీటి ఉధృతితో గత రెండేళ్లుగా తరుచూ గేట్లు ఎత్తి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గతంలో ఎల్ఎండీ గేట్లు ఎప్పుడు ఎత్తుతారా.. జలశయం అందాలు చూసి తరిద్దామా అనుకున్న పర్యాటకులకు ఈ సొగసు చూడటం సర్వసాధారణంగా మారింది. తాజాగా మరోసారి ఎల్ఎండీ గేట్లను ఎత్తడంతో వరద నీరు దిగువకు వెళ్తోంది. అయితే, 32 ఏళ్ల […]
దిశ, మానకొండూరు : కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టు 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరద నీటి ఉధృతితో గత రెండేళ్లుగా తరుచూ గేట్లు ఎత్తి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గతంలో ఎల్ఎండీ గేట్లు ఎప్పుడు ఎత్తుతారా.. జలశయం అందాలు చూసి తరిద్దామా అనుకున్న పర్యాటకులకు ఈ సొగసు చూడటం సర్వసాధారణంగా మారింది.
తాజాగా మరోసారి ఎల్ఎండీ గేట్లను ఎత్తడంతో వరద నీరు దిగువకు వెళ్తోంది. అయితే, 32 ఏళ్ల క్రితం రికార్డును ఎల్ఎండీ ఈ ఏడాది బ్రేక్ చేసింది. 1989లో వచ్చిన వరద ఉధృతి మాదిరిగానే ఈ సారి కూడా ఎల్ఎండీకి వరద వచ్చిచేరిందని ఇరిగేషన్ అధికారుల రికార్డులు చెప్తున్నాయి. ఈసారి 2.80 లక్షల క్యూసెక్కుల వదర నీరు లోయర్ మానేరు డ్యాంలోకి వచ్చి చేరింది. 1989 తరువాత ఈ స్థాయిలో వరద ఉధృతిగా రావడం ఈ సారే కావడం గమనార్హం.