లవ్ స్టోరీ విడుదల అప్పుడే!

అక్కినేని వారసుడు నాగచైతన్య, మలార్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ ఇప్పటికే చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఆ ప్రభావం రిలీజ్ డేట్‌పై పడింది. దీంతో ప్రభుత్వం ఎలాగూ షూటింగ్స్‌కు అనుమతించింది కాబట్టి వెంటనే చిత్రీకరణ ప్రారంభించి సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట డైరెక్టర్ […]

Update: 2020-06-08 08:55 GMT

అక్కినేని వారసుడు నాగచైతన్య, మలార్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ ఇప్పటికే చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఆ ప్రభావం రిలీజ్ డేట్‌పై పడింది. దీంతో ప్రభుత్వం ఎలాగూ షూటింగ్స్‌కు అనుమతించింది కాబట్టి వెంటనే చిత్రీకరణ ప్రారంభించి సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శేఖర్ కమ్ముల చైతూను ప్రజెంట్ చేయబోతుండగా అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ‘ఏయ్ పిల్లా’ సాంగ్‌లో చైతూ యాక్టింగ్‌కు ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా కాగా యువసామ్రాట్ నటనను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ప్రత్యేక గుర్తింపు పొందిన సాయిపల్లవి.. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మాయ చేసేందుకు సిద్ధంగా ఉంది. విరాటపర్వంలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్న ఈ రౌడీ బేబీ.. ఫస్ట్ లుక్‌తోనే ఇంప్రెషన్ కొట్టేసింది.

Tags:    

Similar News