పీఎస్‌లో భోజనం ముట్టని లోకేశ్
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థి రమ్య కుటుంబాన్ని ఇతర టీడీపీ నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో లోకేశ్ తో పాటు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాతోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో లోకేశ్‌ను అక్కడి నుంచి ప్రత్తిపాడు […]
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థి రమ్య కుటుంబాన్ని ఇతర టీడీపీ నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో లోకేశ్ తో పాటు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాతోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో లోకేశ్‌ను అక్కడి నుంచి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. మిగిలిన వారిని నల్లపాడు పీఎస్‌కు తరలించారు. ప్రత్తిపాడు పీఎస్‌లో నారా లోకేశ్ ఆందోళనకు దిగారు. పరామర్శించడానికి వెళ్లినవారిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. అరెస్ట్‌కు నిరసనగా మధ్యాహ్నం భోజనం చేయలేదు. మరోవైపు ప్రత్తిపాడు పీఎస్ ఎదుట పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గుమికూడారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నారా లోకేశ్‌ను పోలీసులు విడుదల చేశారు.