మంచిర్యాల జిల్లాలో మిడతలు
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో గురువారం మిడతలు కలకలం సృష్టించాయి. కొద్ది రోజులుగా మహారాష్ట్ర సరిహద్దుల్లో మిడతలు మాటేసి ఉన్నాయన్న సమాచారం.. తాజాగా జిల్లాలో కనిపించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని కన్నెపల్లి మండలం నాయకన్పేట్లో మిడతలు కనిపించాయి. అయితే పంటపొలాల్లో కాకుండా పిచ్చిచెట్ల మీద కనిపించాయి. మిడతలు పెద్ద మొత్తంలో కనిపించడం రైతుల ఆందోళనకు కారణం అవుతోంది. అయితే ఇవి స్థానికంగా కనిపించేవేనని కొందరు అభిప్రాయ పడుతుండగా… పొలాలపై దాడుల కోసం వచ్చిన మిడతలుగా ఇంకొందరు […]
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో గురువారం మిడతలు కలకలం సృష్టించాయి. కొద్ది రోజులుగా మహారాష్ట్ర సరిహద్దుల్లో మిడతలు మాటేసి ఉన్నాయన్న సమాచారం.. తాజాగా జిల్లాలో కనిపించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని కన్నెపల్లి మండలం నాయకన్పేట్లో మిడతలు కనిపించాయి. అయితే పంటపొలాల్లో కాకుండా పిచ్చిచెట్ల మీద కనిపించాయి. మిడతలు పెద్ద మొత్తంలో కనిపించడం రైతుల ఆందోళనకు కారణం అవుతోంది. అయితే ఇవి స్థానికంగా కనిపించేవేనని కొందరు అభిప్రాయ పడుతుండగా… పొలాలపై దాడుల కోసం వచ్చిన మిడతలుగా ఇంకొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న బెల్లంపల్లి కృషి విఙాన కేంద్రం శాస్త్రవేత్త డా,, రాజేశ్వర్ నాయక్ గ్రామానికి తరలి వెళ్లి మిడతలను పరిశీలించారు.