కర్నాటకలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ?

బెంగళూరు : కర్నాటకలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కరోనా కట్టడికని రాత్రి పూట, వీకెండ్ కర్ఫ్యూలు పెట్టినా, రెండు వారాల పాటు క్లోజ్ ‌డౌన్ విధించినా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. దీంతో అక్కడ పూర్తిస్థాయిలో కఠిన లాక్‌డౌన్ విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. కాగా, ఇదే విషయమై ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఆదేశాల కోసం వేచి చూస్తున్నది. ప్రధాని […]

Update: 2021-05-05 08:35 GMT

బెంగళూరు : కర్నాటకలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కరోనా కట్టడికని రాత్రి పూట, వీకెండ్ కర్ఫ్యూలు పెట్టినా, రెండు వారాల పాటు క్లోజ్ ‌డౌన్ విధించినా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. దీంతో అక్కడ పూర్తిస్థాయిలో కఠిన లాక్‌డౌన్ విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. కాగా, ఇదే విషయమై ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఆదేశాల కోసం వేచి చూస్తున్నది. ప్రధాని మోడీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని సీఎం తెలిపారు. ఈ మేరకు మంగళవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యడియూరప్ప మాట్లాడుతూ.. ‘దేశ ప్రధాని మాట్లాడాల్సి ఉంది. ఆయన ఏం నిర్ణయించినా మేం అమలు చేయాలి. ఆయన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. దాని మేరకు నిర్ణయం తీసుకుంటాం..’ అని తెలిపారు.

Tags:    

Similar News